క్రైమ్ మిర్రర్ : నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కార్తీక దీపాలు వెలిగించే సమయంలో ప్రమాదవశాత్తు ఓ మహిళ చీరకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో భానుమతి (64) తీవ్రంగా గాయపడింది.
వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ భానుమతి మృతిచెందింది. మరోవైపు మంటలు ఇంట్లోని సోఫా, ఇతర వస్తువులకు వ్యాపించడంతో అవి కూడా కాలిపోయాయి.
సమాచారం అందుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పండుగ సమయంలో జరిగిన ఈ విషాదంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
also read : కోటి ఓట్లు.. 90 సీట్లు…! కాంగ్రెస్ లో కొత్త నినాదం …
