-
మారిన ప్రభుత్వ నిర్ణయం
-
రెండు విభాగాలుగా నిర్మాణం
-
అలైన్మెంట్ మార్చిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. 2028 లోగా తొలి విడత పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది. ఒకవైపు కోర్ క్యాపిటల్ లో నిర్మాణాలు, ఆపై కేంద్ర ప్రభుత్వ రవాణా నిర్మాణాలను కులికి తేవాలని చూస్తోంది. అయితే తాజాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పైన దృష్టి పెట్టింది. నాలుగు ప్యాకేజీల్లో ఈ నిర్మాణం పూర్తిచేయాలని తొలుత డిసైడ్ అయింది. కానీ ఇప్పుడు నిర్ణయం మారింది. అందులో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లు ఆహ్వానించింది. దీంతో అవుటర్ రింగ్ రోడ్డు రూట్ ఖరారు అయింది. మండలాలు, గ్రామాలను కూడా ఫిక్స్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఈ ప్రాజెక్టు కీలకంగా భావిస్తున్నారు.
గతంలో నాలుగు ప్యాకేజీలుగా…
గతంలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నాలుగు ప్యాకేజీలుగా విభజించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. తాజాగా దానిని రెండు ప్యాకేజీలుగా కుదించింది. పబ్లిక్ ప్రైవేట్ అప్రైజల్ కమిటీ సూచనల మేరకు ప్యాకేజీల్లో మార్పులు జరిగాయి. ఏపీఎసి ఆమోదం తెలపడంతో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల ప్రక్రియ తిరిగి మొదలైంది. కాంట్రాక్టర్లు బిడ్లు సమర్పించేందుకు జనవరి 15 వరకు గడువు ప్రకటించింది. రాజా దండర్లలో ఔటర్ రింగ్ రోడ్డు పొడవు మొత్తం 195. 13 కిలోమీటర్లు గా పేర్కొన్నారు. ఇందులో ప్రధానమైన ఔటర్ రింగ్ రోడ్డు 189.93 కిలోమీటర్లు కాగా.. గుంటూరును ఓఆర్ఆర్ తో కలిపేందుకు నారాకోడూరు నుంచి గుంటూరు శివారులో ఉన్న బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల్లో నిర్మించే కనెక్ట్ రోడ్డుతో కలిపి.. మొత్తం 195.13 కిలోమీటర్లు గా పేర్కొన్నారు.
అయితే తొలితా పిలిచిన టెండర్లలో దీనిని 27.93 కిలోమీటర్లు, 56 కిలోమీటర్లు, 55.7 కిలోమీటర్లు, 55.5 కిలోమీటర్లు చొప్పున నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. రాజా నిర్ణయం మేరకు ఇప్పుడు రెండు ప్యాకేజీలుగా మార్చారు. అందులో * తొలి ప్యాకేజీ పొడవు 87.63 కిలోమీటర్లు. అది ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల సమీపం నుంచి అదిరిపల్లి, ఉయ్యూరు మీదుగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెం వరకు ఉంటుంది. రెండో ప్యాకేజీ కింద 107.50 కిలోమీటర్లు రహదారి ఉండనుంది. అది ఉయ్యూరు, గుంటూరు మీదుగా కంచి కర్ల వరకు ఉంటుంది. కృష్ణా నదిపై నిర్మించి రెండు కీలకమైన వంతెనలు ఈ ప్యాకేజీ పరిధిలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. ఓ ఆర్ ఆర్ నిర్మాణం పూర్తి కాగానే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 30 వాయిదాలలో చెల్లించే టెండర్లు ఆహ్వానించారు. ఈ ఓ ఆర్ ఆర్ పరిధిలోకి ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలు వస్తాయి. మొత్తం రూ.15,116.45 కోట్లు ఖర్చు అవుతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.
