Homeతెలంగాణజనసేనలోకి 'చేగొండి...!

జనసేనలోకి ‘చేగొండి…!

  • ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు

  • పవన్ కళ్యాణ్ అభివృద్ధి నచ్చి చేరినట్లు ప్రకటన

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జనసేనలో చేరికలు మొదలయ్యాయి. అందునా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల కుటుంబాలు చేరడం విశేషం. ముఖ్యంగా తెలుగు పాటల రచయితగా అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరడం గమనార్హం. అనంత శ్రీరామ్ ది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దొడ్డిపట్ల. చాలా ఏళ్లుగా సినీ గేయ రచయితగా స్థిరపడ్డారు అనంత్ శ్రీరామ్. ఎన్నెన్నో విజయవంతమైన సినిమాలకు పాటలను అందించారు. సినీ పరిశ్రమలో కూడా మంచి పేరు ఉంది. బుల్లితెర హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. తన తల్లిదండ్రులకు తీసుకొచ్చి జనసేన సభ్యత్వం ఇప్పించారు. జనసేన నేతలు అనంత్ శ్రీరామ్ కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించారు.

సర్పంచ్ బరిలో…

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా దొడ్డిపట్ల సర్పంచ్ బరిలో అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి నిలిచారు. అనంత శ్రీరామ్ తండ్రి చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, ఉమా రాణి దంపతులు జనసేన పార్టీని ఆశ్రయించారు. తమకు మద్దతు తెలపాలని కోరారు. ఏకగ్రీవ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీలో చేరితే అధికార కూటమిపరంగా అభివృద్ధి చేసుకోవచ్చని భావించి.. జనసేనలో చేరినట్లు అనంత శ్రీరామ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ పనితీరు, ఆయన గ్రామాల పట్ల చూపిస్తున్న శ్రద్ధ చూసి తన భర్తతో కలిసి జనసేన పార్టీలో చేరినట్లు ఉమారాణి తెలిపారు.

హరి రామ జోగయ్యకు సమీప బంధువు…

అనంత శ్రీరామ్ కు చేగొండి హరి రామ జోగయ్య సమీప బంధువు. వరుసకు పెదనాన్న అవుతారు. ప్రాథమిక విద్య స్వగ్రామం దొడ్డిపట్లలో పూర్తి చేశారు. విజయవాడలో ఇంటర్, బాపట్లలో ఇంజనీరింగ్ కళాశాలలో చేరారు. బీటెక్ మూడో సంవత్సరంలోనే సినీ గేయ రచయితగా స్థిరపడాలని భావించి అటువైపు అడుగులు వేశారు. వాస్తవానికి 12 ఏళ్ల వయసులోనే ఆయన పాటలు రాయడం ప్రారంభించారు. ఆయనకు గురు వంతు ఎవరూ లేకపోవడం విశేషం. తొలిసారిగా కాదంటే అవుననిలే చిత్రంతో అవకాశం లభించింది. చిరంజీవి అందరివాడు చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. 2017లో ఏపీ ప్రభుత్వం నుంచి కళా రత్న పురస్కారం అందుకున్నారు. అంతకుముందు నంది పురస్కారం అందుకున్నారు. ఉత్తమ గీత రచయితగా సైమా అవార్డులు సైతం అందుకున్న ఘనత ఆయనది. ప్రస్తుతం బుల్లితెరలో అనేక కార్యక్రమాల్లో సైతం హోస్టుగా కనిపిస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ఉపాధి కల్పిస్తున్నారా.. ఉసురు తీస్తున్నారా?
  2. అధికార పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి సింహగర్జన!
  3. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
  4.  ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు