Homeక్రీడలుఐపీఎల్ 2027కు SRH విధ్వంసకర బ్యాటర్ దూరం..!

ఐపీఎల్ 2027కు SRH విధ్వంసకర బ్యాటర్ దూరం..!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు, అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. జట్టు కీలక ఓపెనర్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ ‘క్రిక్‌ఇన్ఫో’ వెల్లడించింది. తన బిజీ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడలేనని హెడ్ ఇప్పటికే ఫ్రాంచైజీ యాజమాన్యానికి స్పష్టం చేసినట్లు సమాచారం.

సన్‌రైజర్స్ జట్టు విజయాల్లో ట్రావిస్ హెడ్ పాత్ర ఎంతో కీలకం. 2024 ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడిని రూ. 6.8 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ, విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.

గత మూడు సీజన్లలో హెడ్ ప్రదర్శనను పరిశీలిస్తే జట్టుకు అతడు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. 2024 సీజన్‌లో ఏకంగా 191 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత 2025 సీజన్‌లో 374 పరుగులు, 2026 సీజన్‌లో 410 పరుగులతో నిలకడగా రాణించాడు.
టాప్ ఆర్డర్‌లో మెరుపు వేగంతో పరుగులు రాబట్టే ట్రావిస్ హెడ్ లేకపోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీరని లోటనే చెప్పాలి. వచ్చే సీజన్‌లో అతడి గైర్హాజరీ వల్ల ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్‌లో జోరు తగ్గే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. హెడ్ స్థానాన్ని భర్తీ చేసే సరైన ఓపెనర్‌ను వెతకడం ఇప్పుడు సన్‌రైజర్స్ యాజమాన్యానికి పెద్ద సవాలుగా మారనుంది.

మార్చిలోనే జగన్ పాదయాత్ర…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు