Homeతెలంగాణరూ.200 రిజిస్ట్రేషన్ ఫీజుపై హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి.. పిటిషన్‌పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు!

రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజుపై హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి.. పిటిషన్‌పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు!

అపోలో ఆసుపత్రి వసూలు చేస్తున్న రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు వ్యవహారం తెలంగాణ హైకోర్టులో చర్చకు దారితీసింది. ఈ ఫీజును సవాలు చేస్తూ విశాఖపట్నానికి చెందిన శంకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా పిటిషనర్ విశాఖపట్నం నుంచి కేవలం రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు అంశంపై కేసు వేయడానికి హైదరాబాద్ రావడంపై న్యాయమూర్తులు జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత చిన్న మొత్తానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతాయని అభిప్రాయపడ్డారు.

విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన సూచనల నేపథ్యంలో పిటిషనర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ఉపసంహరణతో విచారణ ముగిసింది.

also read: చిత్తూరులో విషాదం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ వేధింపులతో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు