-
పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో ప్రకటన
-
మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమా
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు తన పార్టీ పేరును ప్రకటించారు. 11 నెల 11వ తేదీన ప్రకటించడం గమనార్హం. తన పార్టీకి పరివర్తన రాజనీతి పార్టీగా పేరు పెట్టారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా తన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కాషాయం, తెలుపువర్ణాలు, ధర్మచక్రంతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ, కులమత రాజకీయాలకు స్వస్తి పలికి.. పారదర్శకమైన పరివర్తన రాజనీతిని అందించడమే తమ ప్రధాన ధ్యేయమని వచ్చారు. తమ పార్టీ ఎవరికి బీ టీం కాదు అని తేల్చి చెప్పారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెప్పారు. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
వైసీపీలో వెలుగు వెలిగి…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆడిటర్ గా ఉన్న ఆయన అనతి కాలంలోనే జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోపిడీ చేసినట్లు కేసులు నమోదయ్యాయి. సిబిఐ కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యారు కూడా. అయితే ఈ అక్రమస్తుల కేసుల్లో ఏ2 గా ఉన్నారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి తో పార్టీ అరెస్టయ్యారు. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ అభివృద్ధితో పాటు అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో దోహదపడ్డారు. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనలేని ప్రాధాన్యం దక్కింది. పార్టీలో నంబర్ 2 గా కూడా ఎదిగారు. అయితే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డికి ఘోర పరాజయం ఎదురైంది. దీంతో అక్కడ వైసీపీలో ఉన్న వర్గ విభేదాలను తట్టుకోలేక విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. కానీ కొన్నేళ్ల తర్వాత మళ్లీ రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తూ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈరోజు తన కొత్త పార్టీని ప్రకటించారు.
యువతకు ప్రాధాన్యం…
కొత్త పార్టీ ఏర్పాటు సందర్భంగా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ఆర్థిక వ్యవస్థ పది లక్షల కోట్ల అప్పుల భారంతో ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు వీలుగా ప్రతి ప్రజాప్రతినిధికి ఖచ్చితమైన రెజ్యూమ్, సామర్ధ్య నివేదిక ఉండాలని.. అర్హత ఆధారంగానే తాను పార్టీలో బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. పార్టీలో జెన్ జీ యువతకు 60 శాతం అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాన్ని నూతన తరానికి చేరవేస్తూ.. క్షేత్రస్థాయి నుంచి యువ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీల తమ పార్టీ పని చేస్తుందని చెప్పుకొచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్, ప్రతి ఎకరానికి సాగునీరు, చదువుకున్న యువతకు ఉపాధి కల్పనే తమ పార్టీ విధానమంటూ ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని.. పార్టీకి మార్గదర్శకుడిగా మాత్రమే వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా టిటిడి ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు ఓ వి రమణ పేరు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై కూడా విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. మొత్తానికి అయితే ఏపీలో మరో రాజకీయ పార్టీ శకం ప్రారంభం అయినట్టే.
ఇవి కూడ చదవండి:
-
టాలీవుడ్లోకి రష్మిక ఎంట్రీ వెనుక ఆసక్తికర నిజాలు.. మొదట నటించడానికి ఒప్పుకోలేదన్న డైరెక్టర్!
-
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
-
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వేళ… రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్!
-
రియల్ ఎస్టేట్లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
