Homeతెలంగాణమాస్ లీడర్ గా కేటీఆర్...!

మాస్ లీడర్ గా కేటీఆర్…!

  • అడ్డుకునే పనిలో సీఎం రేవంత్

  • వ్యక్తిగత ఆహార్యం పై వ్యంగ్యోక్తులు

  • పక్కా రాజకీయ వ్యూహంతో తెలంగాణ ముఖ్యమంత్రి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూటు మార్చారు. తన మాటల దాడిని కేటీఆర్ వై ఎక్కు పెడుతున్నారు. గతంలో గులాబీ పార్టీ అగ్రనేత కెసిఆర్ ను, ఆయన పాలన వైఫల్యాలను ప్రధానంగా ఎండగట్టే వారు. కానీ ఇటీవల కాలంలో కేటీఆర్ ను వ్యక్తిగతంగా, ఎమోషనల్ గా దెబ్బకొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వేదికల్లో సైతం కేటీఆర్ గడ్డం, మీసాలు, ఆహార్యం, కొత్త లుక్ వంటి పూర్తి వ్యక్తిగత విషయాలపై నేరుగా విరుచుకుపడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడి మేకోవర్ ఆయన వ్యక్తిగత ఇష్టా ఇష్టాలకు సంబంధించిన వ్యవహారం అయినప్పటికీ.. దానిని రేవంత్ రెడ్డి పదేపదే రాజకీయ వేదికల పైకి లాగి ఎగతాళి చేయడం వెనుక లోతైన రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది.

కార్పొరేట్ గ్లామర్ ను ఆసరాగా చేసుకుని…

కేటీఆర్ కు ఉన్న అర్బన్, కార్పొరేట్ గ్లామర్ పటాపంచలు చేయడమే ఈ వ్యూహంలో భాగం. శాసనసభ ఎన్నికల పరాజ్యం తర్వాత కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. వయోభారంతో పాటు అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ బాధ్యతలను అనధికారికంగా కేటీఆర్ ముందుండి నడిపిస్తున్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు కేటీఆర్ అన్న స్పష్టత రేవంత్కు ఉంది. అందుకే ఆయనకు యువత, విద్యావంతుల్లో ఉన్న ఇమేజ్ ను గ్రామీణ ప్రజలు దృష్టిలో పలుచన చేయాలన్నది రేవంత్ ఎత్తుగడ. గడ్డం పెంచినంతమాత్రాన విప్లవకారుడు లేదా ప్రజా నాయకుడు కాలేరని.. ఇదంతా కేవలం ఓట్ల కోసం చేస్తున్న సినిమాటిక్ గెటప్ మాత్రమేనని ప్రజల మెదల్లోకి ఎక్కించడం ద్వారా.. కేటీఆర్ ను క్షేత్రస్థాయి మాస్ లీడర్ గా స్థిరపడకుండా అడ్డుకునే ప్రయత్నం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మానసికంగా దెబ్బ కొట్టాలని…

మానసికంగా కేటీఆర్ ను దెబ్బ కొట్టాలన్న వ్యూహంలో భాగంగానే రేవంత్ సంచలన ప్రకటనలు చేస్తున్నారు. మానసికంగా, భావోద్వేగ పరంగా ఆత్మరక్షణలోకి నెట్టి.. సైకలాజికల్ వార్ ఫేర్ కూడా ఇందులో దాగుంది. సాధారణంగా కేటీఆర్ అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నిస్తుంటారు. పాలనతో పాటు హామీల అమలు, రుణమాఫీ, హైడ్రా వంటి సున్నితమైన అంశాలపై గులాబీ పార్టీ గట్టిగా మాట్లాడినప్పుడు.. వాటిపై సమాధానాలు చెప్పే దానికంటే వ్యక్తిగత దాడితో కేటీఆర్ ను భావోద్వేగానికి గురిచేసి.. అసహనం కోల్పోయేలా చేయడం రేవంత్ వ్యూహం. కేటీఆర్ తన రూపురేఖలు, ఆహారంపై వస్తున్న విమర్శలకు వివరణలు ఇచ్చుకుంటే.. ప్రభుత్వంపై చేయాల్సిన పాలనాపరమైన దాడి తనంతట అదే పక్కదారి పడుతుంది అనేది రేవంత్ ఆలోచన. ఆయన విసిరే వ్యక్తిగత వలలు కేటీఆర్ పడి ప్రతిదాడికి దిగితే… చర్చ మొత్తం అసలు సమస్యలను వదిలేసి వ్యక్తిగత దూషణల చుట్టూ తిరగనుంది. మరోవైపు కేసీఆర్ కంటే కేటీఆర్ పై విరుచుకు పడడం రేవంత్ కు సులువైన అంశం. అందుకే కేటీఆర్ పై వ్యక్తిగత దాడి చేస్తున్నారు. ప్యాలెస్ లీడర్ గా ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు. దీనిని కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. నూతన సంవత్సరంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరశం ఖం..!
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3. తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు