Homeక్రైమ్హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.. 10 రోజులైనా దొరకని ఆచూకీ.. కొనసాగుతున్న పోలీసుల గాలింపు!

హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.. 10 రోజులైనా దొరకని ఆచూకీ.. కొనసాగుతున్న పోలీసుల గాలింపు!

హైదరాబాద్‌లోని నాగోలు ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయి పది రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 31వ తేదీ ఉదయం నాగోలు ప్రాంతానికి చెందిన వరుణ్‌తేజ్‌ (8), మహేశ్‌ (6) ఇంటి నుంచి వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా చిన్నారులు ఉప్పల్‌, రామంతాపూర్‌ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ కొనసాగించారు. 70 మందికి పైగా పోలీసు సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతోపాటు డ్రోన్ల సహాయంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహించారు.

అంతేకాకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వసతి గృహాల్లోనూ చిన్నారుల కోసం వెతికారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లభించలేదు. చిన్నారుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 వేల నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు.

ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారనే విషయం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చిన్నారుల గురించి ఏవైనా వివరాలు తెలిసినవారు 8790968873, 8712662723 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

also read: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు