Homeతెలంగాణతెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు గత ప్రభుత్వ అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కెసిఆర్ పాలించిన పదేళ్ల కాలంలో రాష్ట్రం దాదాపు రూ. 8.15 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆ అప్పులకు సంబంధించి ప్రతీ నెలా అసలు మరియు వడ్డీల రూపంలోనే రూ. 80 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని వివరించారు.అయినప్పటికీ, “నేను తిన్నా, తినకపోయినా అప్పులు కడుతున్నా” అంటూ తన ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పాలనలో ఎక్కడా జాప్యం జరగకుండా చూస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కేటీఆర్, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ప్రతి నెలా 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ క్రమం తప్పకుండా జీతాలు అందజేస్తున్నామని తెలిపారు. నెలాఖరు వరకు ఆగకుండా, ప్రతి నెలా 10వ తేదీ లోపే సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పెండింగ్ బిల్లులను సైతం ప్రతి నెలా 20వ తేదీ లోపు చెల్లిస్తున్నామని అన్నారు.దీంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, 2028 నాటికి కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంపై ఎంతటి ఆర్థిక భారమున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఏజెన్సీ ఫలితాలు, మతమార్పిడి అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు