Homeఆంధ్ర ప్రదేశ్చీరాల టిడిపిదే...!

చీరాల టిడిపిదే…!

  • కూటమి చైర్పర్సన్ అభ్యర్థి ఘనవిజయం

  • బలంగా పుంజుకున్న కాంగ్రెస్

  • వార్డు స్థానాల్లో రెండో స్థానం

  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో చీరాలది ప్రత్యేక స్థానం. అక్కడ ఎప్పుడూ రాజకీయాలు హాట్ హాట్ గానే ఉంటాయి. తాజాగా అక్కడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిడిపి కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. భారీ వర్షాల కారణంగా అక్కడ ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి.. సమీప ప్రత్యర్థి పై ఏకంగా 6468 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి ప్రత్యక్ష పద్ధతిలో నమోదైన ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా జరిగింది. టిడిపి అభ్యర్థికి అత్యధికంగా 21, 833 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన ప్రత్యర్థ్యాధిగా నిలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 15,415 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 11, 025 ఓట్లు రావడం విశేషం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్లను చీల్చుకున్నాయి. అయినా సరే కూటమి ఓటు బ్యాంక్ అత్యంత పటిష్టంగా నిలబడి తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పట్టణ ప్రజలు ఆమోద ముద్ర వేశారు.

ఏకపక్ష విజయం…

కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి టీడీపీ కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. మొత్తం వార్డుల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 25 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 22 వార్డులను గెలుచుకోగా.. మిత్రపక్షాలైన జనసేన రెండు, బిజెపి ఒక వార్డులో గెలుపొందింది. అయితే అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. పది వార్డులను కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలకే పరిమితమై.. మూడో స్థానానికి పడిపోయింది. దీనిని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఆమంచి ప్రభావం…

చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ ప్రసాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. బలమైన అభ్యర్థులను వార్డు స్థానాలకు పోటీ చేయించారు. దీంతో మంచి ఫలితాలే వచ్చాయి. మరోవైపు స్థానిక టిడిపి ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య ఒక వ్యూహం ప్రకారం పని చేశారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. ఇక్కడ వైసిపి ఇన్చార్జిగా కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ఉన్నారు. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా ఆమంచి కృష్ణమోహన్ తన ప్రభావం చాటుకున్నారు. దీంతో వైసీపీలో సమీకరణలు మారే అవకాశం ఉంది. అక్కడ ఆమంచి కృష్ణ మోహన్ ను వైసీపీలోకి రప్పించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే చీరాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లే.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య 
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3.  బీహార్‌లో దారుణం.. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం!
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు