Homeతెలంగాణమహేష్ కుమార్ గౌడ్ నిస్సహాయత...!

మహేష్ కుమార్ గౌడ్ నిస్సహాయత…!

  • కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలపై ఆవేదన

  • నేతలు తనను లెక్కచేయడం లేదని అధిష్టానానికి లేఖ

  • బడా నేతల ను వదిలి చిన్న నాయకులపై ఫిర్యాదు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ మళ్లీ ఢిల్లీకి చేరింది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య సమన్వయ లోపం మరోసారి ఢిల్లీకి చేరడం విశేషం. పార్టీని క్రమశిక్షణతో నడపాల్సిన పీసీసీ చీఫ్ పదవిలో ఉన్నప్పటికీ.. సీనియర్ నేతలు తనను ఎంత మాత్రం లెక్క చేయడం లేదన్న తీవ్ర అసహనం, నిస్సహాయతతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ నాయకత్వానికి ప్రత్యేక నివేదికను పంపారు. ఢిల్లీలోని ఓ హోటల్ లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య చోటు చేసుకున్న తీవ్ర వాగ్వాదం పార్టీ పరువును బజారున పడేసింది. దీనిపై పిసిసి నాయకత్వం సీరియస్ గా చర్యలకు ఉపక్రమించింది.

ఇద్దరు నేతల గైర్హాజరు…

ఢిల్లీ ఘటనకు సంబంధించి మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును వివరణ కోరేందుకు ఇద్దరు నేతలను గాంధీభవన్ కు రావాల్సిందిగా పిసిసి చీఫ్ ఆదేశించారు. కానీ వారు ఆయన పిలుపును పట్టించుకోలేదు. గాంధీభవన్ కు రాలేదు. దీంతో తన నాయకత్వానికే విలువ లేకుండా పోతోందని మహేష్ గౌడ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ బాహటంగా వివాదాలకు దిగిన నేతలను కూర్చోబెట్టి మాట్లాడేందుకు గాంధీభవన్ కు రావాలని కోరినా ఇద్దరూ స్పందించలేదు. తన మాటను సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వినకపోతే సంస్థాగతంగా పార్టీని ఎలా ముందుకు నడపగలమని.. ఈ విషయంలో అధిష్టానమే జోక్యం చేసుకొని క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కాంగ్రెస్ అగ్ర నేతలను కోరినట్లు తెలుస్తోంది.

రాజగోపాల్ రెడ్డి పేరు లేకుండా…

ఇంకోవైపు మహేష్ గౌడ్ అధిష్టానానికి పంపిన లేఖలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీతో పాటు రేవంత్ సర్కార్ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని.. ప్రభుత్వ పనితీరును స్వపక్ష ఎమ్మెల్యే నే అవమానించేలా మాట్లాడడం వల్ల విపక్షాలకు రాజకీయ ఆయుధాలు ఇచ్చిన క్లౌతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల పర్వంలో మహేష్ కుమార్ గౌడ్ అనుసరించిన వైఖరి పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎందుకంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన ప్రస్తావన లేకుండా లేఖ రాయడంపై కాంగ్రెస్ పార్టీలోనే ఒక విధానమైన చర్చ జరుగుతోంది. బడా నేతలపై వేటువేసే ధైర్యం లేక.. కేవలం కొందరు నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  భారత్ సమ్మిట్ కు సర్వం సిద్ధం…!
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3.  బీహార్‌లో దారుణం.. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం!
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు