Homeతెలంగాణఅమ్మో డిజిటల్ అరెస్ట్...!

అమ్మో డిజిటల్ అరెస్ట్…!

  • దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆధునిక సైబర్ దోపిడి

  • ప్రేక్షక పాత్ర పోషిస్తున్న బ్యాంకులు

  • అత్యున్నత న్యాయస్థానం గట్టి హెచ్చరికలు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ఈ ఆధునిక సైబర్ దోపిడీలు బాధితులు తమ జీవితకాల సంపాదనను నిమిషాల వ్యవధిలోనే కోల్పోతున్నారు. ఈ దారుణ మోసాలకు కట్టడి చేయడంలో బ్యాంకులు సైతం విఫలమవుతున్నాయి. ఖాతాదారుల సొమ్ముకు సంరక్షకులుగా ఉండాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం పై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యం వందలు, వేల రూపాయల లావాదేవీలు మాత్రం చేసి ఒక సామాన్య సీనియర్ సిటిజన్ ఖాతా నుంచి అకస్మాత్తుగా గంటల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దయి.. లక్షలు, కోట్ల రూపాయలు అనుమానాస్పద మ్యూల్ ఖాతాల్లోకి మళ్ళి పోతుంటే.. బ్యాంకింగ్ వ్యవస్థ కళ్ళు మూసుకుని కూర్చుంటుందా? అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వేసిన సూటి ప్రశ్న ఆలోచనాత్మకమైనది. ఆధునిక ఏఐ, అల్గారిధమ్ టెక్నాలజీలు అందుబాటులో ఉన్న నేటి కాలంలో.. ఇలాంటి అసాధారణ ట్రాన్సాక్షన్ ప్యాటరెన్స్ పసిగట్టడంలో బ్యాంకులు విఫలం కావడం ముమ్మాటికీ సాంకేతిక నిర్లక్ష్యమే.

నిబంధనల పేరుతో మోకాలడ్డు…

సైబర్ నేరగాళ్లు బాధితులను మోసం చేస్తుంటే.. తప్పు ఖాతాదారుడిదే అన్నట్టు బ్యాంకులు వ్యవహరిస్తూ వచ్చాయి. మా నిబంధనల ప్రకారం మా బాధ్యత ఏమీ లేదు అంటూ చేతులు దులుపుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఈ నిర్లిప్త ధోరణికి ముగింపు పలుకుతూ స్పష్టమైన హెచ్చరిక జారీచేసింది అత్యున్నత న్యాయస్థానం. బాధితుడు నష్టపోయిన మొత్తం సొమ్మును బ్యాంకులో నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన ప్రాథమిక వ్యాఖ్యలు బ్యాంకింగ్ పరిశ్రమకు గొడ్డలి పెట్టు లాంటి హెచ్చరిక. కేవైసీ నిబంధనలను తుంగలోకి తొక్కి.. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలను సమకూర్చడంలో కొందరు బ్యాంక్ అధికారుల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర కూడా ఉందన్న న్యాయస్థాన పరిశీలన ఈ నెట్వర్క్ ఎంత లోతుగా పాటు పోయిందో తెలియజేస్తోంది.

స్పష్టమైన సంకేతాలు…

ఈ విచారణలో కేవలం సుప్రీంకోర్టు ప్రాథమిక ఆదేశాలను మాత్రమే ఇచ్చింది. తుది తీర్పు కూడా పరిహారం చెల్లించాలనే దశలోనే వెలువడితే.. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ముందు ఇక రెండు స్పష్టమైన మార్గాలు మిగులుతాయి. ఒకటి తమ వద్ద ఉన్న సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ను, రిస్క్ డిటెక్షన్ సాఫ్ట్వేర్లను అత్యున్నత స్థాయికి అప్గ్రేట్ చేసుకుని.. అనుమానాస్పద లావాదేవీలు జరిగే క్షణంలోనే ఆటోమేటిక్ గా డబ్బు బదిలీ కాకుండా.. ఫ్రీజ్ చేసే వ్యవస్థలను పగడ్బందీగా అమలు చేయడం రెండవది.. అలా చేయడంలో విఫలమై ఖాతాదారుడు కోల్పోయే ప్రతి రూపాయికి తమ సొంత జేబులో నుంచే కోట్లాది రూపాయల భారీ జరిమానాలు, పరిహారాలు చెల్లించుకోవడం. ఇప్పటివరకు కేవలం లాభాలు, కమీషన్ల పైనే దృష్టి పెట్టిన బ్యాంకులు … సాంకేతిక తప్పై వెచ్చించే ఖర్చు కంటే ఖాతాదారులకు చెల్లించాల్సిన పరిహారమే 10రెట్లు ఖరీదు అయినదని గ్రహించే పరిస్థితి తలెత్తుతుంది.

కవచంలా మారాల్సిందే…

ప్రతి ఆర్ధిక అంశం పైన నమ్మకమే ప్రధానం. సామాన్యుడి విశ్వాసమై పునాదిగా నడిచే బ్యాంకింగ్ వ్యవస్థ ప్రేక్షక పాత్రను వీడాల్సిన సమయం ఆసన్నమైంది. నేరగాళ్లు ఆధునిక సాంకేతికతతో ఖాతాదారుల మనస్తత్వాలను వాడుకొని.. బెదిరింపులకు పాల్పడుతుంటే.. ఖాతాదారుడు సొమ్ముకు డిజిటల్ కవచంగా నిలవాల్సిన గురితర బాధ్యత పూర్తిగా సేవా ప్రదాతలైన బ్యాంకులపైనే ఉంది. కేవలం లావాదేవీలు జరిపించి లాభాలు దండుకోవడం మాత్రమే బ్యాంకింగ్ కాదని.. డిజిటల్ భద్రతను నిర్ధారించలేక పోతే దాన్ని మూల్యం ఆర్థికంగా తామే చెల్లించాల్సి వస్తుందన్న భయం బ్యాంకుల్లో ఉంటే తప్ప.. సామాన్యుడి ఖాతాదారుల జీవితకాల కష్టార్జితానికి అసలైన రక్షణ దక్కదు. ఏది ఏమైనా సైబర్ నేరాలపై న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు లాంటిది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  పుర పోరుకు అంతా సిద్ధం…! 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్…
  2.  వైసీపీకి షాక్…! టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అప్ప‌ల‌నాయుడు…
  3.  బిజెపిలో నాయకత్వ పోటీ…!
  4.  రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 వెనుక ఉన్న అసలు కథ: అమ్మ సూచనే కారణం!

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు