-
ముగిసిన బి.ఆర్ నాయుడు పదవీకాలం
-
ట్రస్ట్ బోర్డు సభ్యులు సైతం
-
స్థానిక ఎన్నికల తరువాతే కొత్త బోర్డు ప్రకటన
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాదిమంది భక్తులతో ఈ పుణ్యక్షేత్రం రద్దీగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం కూడా. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అంటే క్యాబినెట్ హోదాతో కూడుకున్నది. అటువంటి చైర్మన్ పోస్టులో ఉన్న బిఆర్ నాయుడు పదవీకాలం ముగిసింది. నూతన బోర్డు నియామకం పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు నేతృత్వంలో పాలకమండలిని ప్రకటించారు. ఆ కార్యవర్గం పదవీకాలం రెండేళ్లు పూర్తయింది. సాధారణంగా పదవీకాలం పొడిగింపునకు పెద్దగా అవకాశం లేకపోవడం.. మరోవైపు పదవీకాలంలో పలు వివాదాలు, ఆరోపణలు తెరపైకి వచ్చినందున మళ్లీ ఆయనకే అవకాశం లభించడం కష్టమే అన్న ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం ఎన్నికల కోడ్…
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగనుంది. తరువాత ప్రాదేశిక ఎన్నికలు కొనసాగుతాయి. చివరిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం ఎన్నికల నియామక నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ సాంకేతిక కారణంతో నూతన పాలకమండలి అధికారిక నియామకం తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త బోర్డును ప్రకటించే వరకు శ్రీవారి నిత్య కైంకర్యాలు, పరిపాలన వ్యవహారాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఒక స్పెసిఫైడ్ అధారిటీకి బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
విపరీతమైన పోటీ…
మరోవైపు టీటీడీ నూతన అధ్యక్ష పదవితో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యుల పదవి కోసం అప్పుడే పోటీ ప్రారంభమైంది. ఎన్డీఏ లోని మూడు భాగస్వామ్య పక్షాల నుంచి ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు సినీ, పారిశ్రామిక ప్రముఖుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కూటమి నేతల మధ్య ప్రాంతీయ, సామాజిక సమీకరణలను సమతుల్యం చేయాల్సి ఉన్నందున.. సీఎం చంద్రబాబు నూతన చైర్మన్. స్థానిక ఎన్నికలకు సంబంధించి కోడ్ ముగిసిన వెంటనే కొత్త బోర్డు ఏర్పాటు పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈసారి బిజెపి కూడా ఒక అవకాశం అడుగుతుంది. అదే సమయంలో జనసేన సైతం తమ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతోంది. మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇవి కూడ చదవండి:
-
పుర పోరుకు అంతా సిద్ధం…! 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్…
-
వైసీపీకి షాక్…! టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు…
-
బిజెపిలో నాయకత్వ పోటీ…!
-
రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 వెనుక ఉన్న అసలు కథ: అమ్మ సూచనే కారణం!
