Homeఆంధ్ర ప్రదేశ్పుర పోరుకు అంతా సిద్ధం...! 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్...

పుర పోరుకు అంతా సిద్ధం…! 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్…

  • 8 చోట్ల ఏకగ్రీవం..

  • మిగిలిన 13 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, ఆరు నగర పంచాయతీలకు ఓటింగ్

  • ఏకగ్రీవాల్లో సత్తా చాటిన కూటమి

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఇందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరో ఆరు నగర పంచాయతీలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో 17 మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం. ఇందులో ఎనిమిది చోట్ల అన్ని వార్డులతో సహా పూర్తిస్థాయిలో ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. కొన్నిచోట్ల ఎక్కువ వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కొన్ని వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.

పోలింగ్ వాయిదా…

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా అక్టోబర్ 28న పోలింగ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే నామినేషన్ల సందర్భంగా చోటి చేసుకున్న పరిణామాలు, సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికల ప్రక్రియలు కీలక మార్పులు జరిగాయి. దీంతో పోలింగ్ నవంబర్ 1కి వాయిదా వేశారు. అవసరమైన చోట రెండున రీపోలింగ్, మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ మరుసటి రోజు లెక్కించనున్నారు.

మినీ అసెంబ్లీ పోరు…

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎన్నికలు మినీ అసెంబ్లీ పోరును తలపించాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో గెలుపు పై గట్టి చర్చ నడుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏకగ్రీవాలకు సంబంధించి కూటమి పై చేయి సాధించింది. టిడిపికి అత్యధికంగా 15 స్థానాలు, జనసేన, బిజెపిలకు చెరో స్థానం దక్కాయి. ఓటమి మద్దతుతో 630 మంది వార్డు, డివిజన్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది. శనివారం సైతం సైలెంట్ ప్రచారానికి తెర లేచింది. ఆదివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తొమ్మిదో నెలలోనూ తగ్గని ఫిట్‌నెస్ జోరు.. వర్కౌట్ వీడియోతో ఆకట్టుకుంటున్న సమంత!
  2. అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి శుభలేఖ ప్రత్యేకత ఇదే.. ఖరీదైన గిఫ్ట్‌లా డిజైన్!
  3.  ఆస్ట్రేలియాకు తెలంగాణ తాండూరు కందిపప్పు.. తొలిసారిగా 2.5 టన్నుల ఎగుమతి!
  4.  విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌కు మంటలు!

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు