క్రైమ్ మిర్రర్, సినిమా:- మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, వీరయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఒక భారీ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
ఈ చిత్రానికి ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సందీప్ సింగ్ దర్శకత్వం వహించనుండగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రధాన పాత్రలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటించనున్నారు. బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన టీ సిరీస్ మరియు లెజెండ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 2027 ప్రారంభంలో శరవేగంగా ప్రారంభం కానుంది. భారతీయ చరిత్రలోని మహోన్నత ఘట్టాలను ప్రతిబింబించేలా అత్యంత దార్శనికతతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాపై ఇప్పటికే సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
కొంపముంచిన కొండా దంపతుల దూకుడు…! దెబ్బ తింటున్న ప్రతిష్ట…
ఏపీకి రెండు కేంద్ర బృందాలు.. తుపాను నష్టం, కరవు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన!
