Homeతెలంగాణబిజెపిలో నాయకత్వ పోటీ...!

బిజెపిలో నాయకత్వ పోటీ…!

  • అగ్ర నేతలు అనిపించుకునేందుకు నాయకుల మధ్య గట్టి పోరాటం

  • పాదయాత్రలకు సిద్ధపడుతున్న ఈటెల రాజేందర్

  • మిగతా నేతలు సైతం అదే ప్రయత్నాల్లో…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. కానీ ఆ పార్టీ రాష్ట్ర నేతల్లో మాత్రం సమన్వయం కనిపించడం లేదు. నేను పెద్ద లీడర్ అంటే.. నేను పెద్ద లీడర్ ను అంటూ నేతలు విభేదించుకుంటున్నారు. అంతర్గత నాయకత్వ పోటీ ఆ పార్టీలో సరికొత్త మలుపు తిరుగుతోంది. నవంబర్ 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పాదయాత్ర చేపట్టేందుకు వస్తున్నారు. కానీ అధిష్టానం దృష్టిలో కామే అగ్రనేతలం అని నిరూపించుకునేందుకు రాష్ట్ర బిజెపి కీలక నేతల మధ్య హోరాహోరీ రేసు మొదలైంది. ఈ అంతర్గత పోటీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అందరికంటే ముందుగా అడుగుల వేసి.. మైలేజీని సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయేంతవరకు తన పాదయాత్రను, ఉద్యమాలను కొనసాగిస్తానని శపధం చేశారు.

సీఎం రేసులో నిలబడేందుకు…

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని నేతలంతా చెబుతున్నారు. అయితే ఆ సమయానికి ముఖ్యమంత్రి రేసులో నిలబడేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రసాయన కాలుష్యం, మురుగు సమస్యలను అస్త్రంగా చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ఈటెల రాజేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు సరిగ్గా కొద్ది రోజుల ముందే ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ.. పాదయాత్రకు తెరలేపడం వెనుక పక్కా ప్లానింగ్ ఉందన్నది రాజకీయ వర్గాల భావన. గతంలో ఇదే ప్రాంతానికి ఎంపీగా వ్యవహరించిన రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెడుతూనే.. ఢిల్లీ పెద్దల రాక సమయానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పై తిరుగులేని పోరాటం చేస్తున్న ఏకైక నేత తానేనని స్వయంగా నిరూపించుకునేందుకే ఈటెల ఈ స్కెచ్ వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మిగతా నేతలు అప్రమత్తం…

ఈటెల రాజేందర్ చేస్తున్న ప్రయత్నాలతో మిగతా బిజెపి నేతలు సైతం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పోరాటాలు చేస్తున్న బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి కీలక నేతలు అమిత్ షా దృష్టిలో పడేందుకు తమదైన శైలిలో కార్యాచరణలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరికి వారు కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రత్యేక ఆందోళనలు, సభలు, ప్రెస్ మీట్లతో హై కమాండ్ వద్ద తమ గ్రాఫ్ తగ్గకుండా చూసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతను ఒడిసిపట్టేందుకు నేతలంతా పోటీ పడడం పార్టీ విస్తరణకు మంచిదే అయినా.. ఈ క్రెడిట్ వార్ చివరకు అంతర్గత వర్గ విభేదాలకు దారి తీయకుండా ఉండడమే బిజెపికి అతిపెద్ద సవాల్. అమిత్ షా పర్యటన ముంగిట మొదలైన ఈ పాదయాత్ర రాజకీయాలు పార్టీలో అంతర్గత సమన్వయానికి గండి కొట్టకుండా.. నాయకుల మధ్య విభేదాలను మరింత రాజేయకుండా సాగితేనే కాషాయ దళానికి నిజమైన ప్లస్ పాయింట్ గా మారుతుంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  శబరిమల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!
  2.  భారతైక్యతా శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఉక్కు మనిషికి ఘన నివాళి!
  3.  శివాజీగా రిషబ్ శెట్టి: రెండు భాగాలుగా తెరకెక్కనున్న ‘ఛత్రపతి శివాజీ’ బయోపిక్!
  4.  కొంపముంచిన కొండా దంపతుల దూకుడు…! దెబ్బ తింటున్న ప్ర‌తిష్ట‌…

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు