క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత క్రికెట్ రంగంలో సరికొత్త యంగ్ టాలెంట్ తమ సత్తా చాటుతోంది. పురుషుల, మహిళల లీగ్స్‌లో అత్యంత పిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి యంగ్ ప్లేయర్లు ఆకట్టుకుంటున్నారు.
ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ:- కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పాటు టీమ్ ఇండియాలోనూ అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా అడుగుపెట్టి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
డబ్ల్యూపీఎల్‌లో కాశ్వి కండికుప్ప:-
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లోనూ ఇదే తరహాలో ఒక యంగ్ సంచలనం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల కాశ్వి కండికుప్ప డబ్ల్యూపీఎల్‌లో యంగెస్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవల జరిగిన వేలం పాటలో ఈమెను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షల ధరకు సొంతం చేసుకుంది.
కాశ్వి ఘనతలు:- 2011 ఏప్రిల్ 9న జన్మించిన ఈ యంగ్ స్పిన్ ఆల్‌రౌండర్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇటీవల జరిగిన అండర్-15 వన్డే టోర్నీలో కాశ్వి ఏకంగా 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించి మొత్తం 516 రన్స్ చేసి రికార్డు సృష్టించారు.అత్యంత చిన్న వయసులోనే లీగ్ వేలంలో ఎంపికై సత్తా చాటుతున్న ఈ యంగ్ ప్లేయర్లు భవిష్యత్తులో భారత క్రికెట్‌కు దిక్సూచిగా మారతారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
‘పెద్ది’ వివాదంపై స్పందించిన జాన్వీ కపూర్: ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆవేదన, భావోద్వేగ వ్యాఖ్యలు!
