Homeక్రైమ్30 ఏళ్ల సేవలకు ముగింపు...! సీనియ‌ర్ కెమెరామెన్ శ్రీ‌నివాస్ క‌న్నుమూత‌...

30 ఏళ్ల సేవలకు ముగింపు…! సీనియ‌ర్ కెమెరామెన్ శ్రీ‌నివాస్ క‌న్నుమూత‌…

  • అంత్యక్రియల ఖర్చు భరిస్తానన్న మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి…

రామకృష్ణాపూర్, క్రైమ్‌మిర్ర‌ర్‌: పట్టణానికి చెందిన సీనియర్‌ కెమెరామెన్‌ పులిపాక శ్రీనివాస్‌ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. సుమారు 30 ఏళ్లుగా తేజ న్యూస్‌, సాక్షి,పలు ఎలక్ట్రానిక్‌ మీడియాలో కెమెరామెన్‌గా సేవలందించిన ఆయన మృతి పట్ల స్థానికులు, వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను సైతం కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న శ్రీనివాస్‌ మృతి పలువురిని కలచివేసింది.శ్రీనివాస్‌ మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్‌ స్థానిక కౌన్సిలర్‌, ఇతర నాయకులతో కలిసి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. శ్రీనివాస్‌ అంత్యక్రియల ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు వోడ్నాల శ్రీనివాస్‌ తెలిపారు. అంత్యక్రియల నిర్వహణకు సహకరిస్తామని పేర్కొన్నారు.పలువురు నాయకులు, జర్నలిస్టులు శ్రీనివాస్‌ మృతికి సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. నిద్రలేమితో మానసిక ఆరోగ్యానికి ముప్పు: వైద్యుల కీలక హెచ్చరికలు
  2. కూటమి ప్రభుత్వాన్ని తుడుచిపెట్టేస్తాం: వైఎస్ జగన్ ధీమా
  3.  హయత్‌నగర్‌లో విషాదం.. లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
  4. ఫ్రూట్ జ్యూస్ కంటే పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలు: ఆరోగ్య నిపుణుల సలహా

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు