Homeక్రైమ్డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి హత్య కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్ట్!

డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి హత్య కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్ట్!

క్రైమ్ మిర్రర్ : డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అశ్వనీ కుమార్‌ను రాజస్థాన్‌లోని సలాసర్‌లో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అతడిని అరెస్ట్ చేశారు.

పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో అశ్వనీ కుమార్ నిర్వహిస్తున్న మెడికల్ షాపులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు ఝోటాకు సమాచారం అందింది. దీంతో తన సహచరులతో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన.. ఓ వృద్ధుడికి డ్రగ్స్ విక్రయించడంపై అశ్వనీని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన అశ్వనీ కాల్పులు జరపడంతో ఝోటా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనను ఝోటా ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రసారం చేయడంతో హత్యకు ముందు జరిగిన పరిణామాలు వీడియోలో రికార్డయ్యాయి. సుమారు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రసారంలో తొలి నాలుగు నిమిషాల పాటు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాల్పులు జరగడంతో ఝోటా మృతి చెందారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. హత్యకు సహకరించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అశ్వనీ కుమార్ రాజస్థాన్‌లోని సలాసర్‌కు చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి అతడిని పట్టుకున్నారు.

మాన్సా, పరిసర ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాల విక్రయాలను అడ్డుకునేందుకు పర్వీందర్ సింగ్ ఝోటా కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఆయనకు ఫేస్‌బుక్‌లో 24 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న ఉద్యమకారుడు హత్యకు గురికావడంతో ఆయన అభిమానులు, మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమకారుల్లో ఆందోళన నెలకొంది. ప్రధాన నిందితుడి అరెస్టుతో ఈ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది.
also read : ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు