Homeతెలంగాణ125 ఏళ్ల నిరీక్షణకు తెర‌...! తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే...

125 ఏళ్ల నిరీక్షణకు తెర‌…! తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే…

  • ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలన్నది లక్ష్యం

  • అంగుళం భూమికి కూడా వివాదం తలెత్తకుండా పరిష్కార మార్గం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సమగ్ర భూ సర్వే జరగనుంది. దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపు 125 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములు, నివాస స్థలాలపై సమగ్ర సర్వే చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఒకటిన్నర సంవత్సరాలలో ఈ బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ కఠినమైన కాలపరిమితిని నిర్దేశించుకుంది. నవంబర్ చివరి నాటికి తొలి సర్వే పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఎన్నో భూ వివాదాలు…

తెలంగాణ వ్యాప్తంగా అనేక రకాల భూ వివాదాలు, భూ సమస్యలు నడుస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు ఈ భూ సమగ్ర సర్వే ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగానికి, సాధారణ గృహ కొనుగోలుదారులకు అత్యంత కీలకమైన మలుపుగా మారనుంది. ఇప్పటివరకు రికార్డుల్లో తేడాలు, సరిహద్దుల వివాదాలు, నక్షలు లేకపోవడం వల్ల ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త సర్వే ద్వారా ప్రతి భూభాగానికి ఖచ్చితమైన డిజిటల్ కోఆర్డినేటర్లు, సరిహద్దుల నిర్ధారణ కాండడంతో.. ల్యాండ్ పార్సెల్సుకు సంబంధించి సంపూర్ణమైన టైటిల్ క్లారిటీ లభిస్తుంది. ఇది కొనుగోలుదారులకు కొండంత భరోసా ఇవ్వడమే కాకుండా.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పారదర్శకతను పెంచనుంది.

అత్యాధునికంగా…

అత్యాధునికంగా సమగ్ర భూ సర్వే చేపట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఆధునిక రోవర్లు, శాటిలైట్ మ్యాప్, అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 14 మంది ఉన్నతాధికారులను నియమించడంతోపాటు సచివాలయంలో నిరంతర నిఘా కోసం ఒక డిజిటల్ డాష్ బోర్డును అందుబాటులోకి తెచ్చారు. సర్వే పేరుతో రైతులు లేదా భూ యజమానుల వద్ద పైసా లంచం డిమాండ్ చేసినా.. అక్రమాలకు పాల్పడిన కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

బలమైన సంకల్పంతో…

తెలంగాణ సమాజంలో అసలు భూ వివాదం అన్నది లేకుండా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ఇది పూర్తయితే భవిష్యత్తులో ఒక్క అంగుళం భూమికి సంబంధించి కూడా వివాదాలు, సివిల్ కోర్టు కేసులకు తావు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత రావడంతో బ్యాంకు రుణాలు పొందడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం కావడం, ప్రభుత్వ ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం కావడం వంటి అనేక సానుకూల మార్పులు రానున్నాయి. 125 సంవత్సరాల నాటి పాత వ్యవస్థకు స్వస్తి చెబుతూ… చేపడుతున్న ఈ డిజిటల్ ల్యాండ్ విప్లవంతో తెలంగాణ ల్యాండ్ డిస్ప్యూట్ ఫ్రీ రాష్ట్రంగా అవతరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ఆ మూడు కార్పొరేషన్లపై వైసీపీ గురి!
  2. కులవృత్తి నైపుణ్యం కొరకు ప్రత్యేక (క్లస్టర్) శిక్షణ కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి
  3. ఢిల్లీ మెట్రోలో దారుణం.. సీటు గొడవలో వ్యక్తి మృతి, రిటైర్డ్ ఐఏఎస్‌ అరెస్ట్!
  4. పూణెలో దారుణం.. కట్నం వేధింపులు భరించలేక మహిళా ఐటీ ఇంజనీర్ ఆత్మహత్య!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు