Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో ఇకపై అన్నీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి మండిపల్లి!

ఏపీలో ఇకపై అన్నీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి మండిపల్లి!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారవాణాను మరింత పర్యావరణ హితంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీకి సంబంధించి కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సాధారణ ప్రయాణికులతో పాటు మహిళల సౌకర్యార్థం నడిచే పల్లె వెలుగు, స్త్రీశక్తి బస్సులు కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగానే అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్తగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

మరోవైపు వాహనదారులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ‘వాహన్’, ‘సారథి’ పోర్టల్‌లకు సంబంధించిన సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.సమస్యలు లేదా ఫిర్యాదులు ఉన్నవారు పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 9281607001 ను సంప్రదించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. ఈ నిర్ణయాలతో ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

CJP ధర్నాపై పోలీసుల ఉక్కుపాదం.. ఎక్కడికక్కడ నిరసనకారుల అరెస్ట్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు