హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్:ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం క్వారీలో ఫొటోలు దిగేందుకు వెళ్లిన విద్యార్థి నీటమునిగి మృతి చెందిన ఘటన మేడ్చల్ మల్కాజీగిరి జిల్లాలోని జజవహర్నగర్ పరిధిలోని మల్కారం క్వారీలో చోటు చేసుకుంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పవన్ సాయి తన స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి ఫొటోలు దిగేందుకు మల్కాజ్గిరి క్వారీలో ఈతకు వెళ్లాడు. దీంతో పవన్ సాయి నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని స్నేహితులు హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)కు సమాచారం అందించారు. డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. గాలింపు చర్యలు చేపట్టాయి.
పవన్ సాయి మృతదేహాన్ని వెలికి తీశాయి. అతడి మృతదేహాన్ని జవహర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవన్ సాయికి ఈత రాకపోవడం వల్లే మరణించాడని అతడి స్నేహితులు తెలిపారు. క్వారీ చాలా లోతుగా ఉందని.. అందువల్లే అతడు చనిపోయాడని చెప్పారు. ఈ విషాద ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రయోజకుడు అవుతాడన్న కుమారుడు అర్థాంతరంగా నీట మునిగి మృతి చెందడం తల్లిదండ్రులను శోకసంద్రంలో నింపింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి.
ఇవి కూడ చదవండి:
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 45 రోజుల పసికందు మృతి!
-
రంగారెడ్డి జిల్లాలో విషాదం.. లిఫ్ట్ కింద పడి కార్మికుడు మృతి
-
నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా వ్యాఖ్యల దుమారం.. విమర్శల మధ్య తన వైఖరికి కట్టుబాటు!
-
వారణాసి కోసం రాజమౌళి మరో సంచలనం.. మహేశ్‌బాబు సినిమా కోసం ప్రత్యేక భాష?
