Homeఆంధ్ర ప్రదేశ్ఏపీకి దళపతి విజయ్...!

ఏపీకి దళపతి విజయ్…!

  • విజయవాడ దసరా ఉత్సవాలకు హాజరు

  • తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరించాలన్న ఆలోచన

  • అందుకే సానుకూలత వ్యక్తం చేసిన తమిళనాడు సీఎం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డిస్క్: తమిళనాడు సీఎం విజయ్ ఏపీ పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. విజయవాడలో అత్యంత వైభవంగా జరిగే ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు విజయ్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలోని బృందం ప్రత్యేకంగా ఆహ్వానించింది.

ఎంపీ బృందం ఆహ్వానానికి విజయ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దసరా వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బృందం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే.

  • కొద్ది నెలల కిందట బాధ్యతలు..

కొద్ది నెలల కిందట తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు విజయ్. ఇబ్బందులను అధిగమించి రాజకీయంగా రాటు తేలుతున్నారు. ఇటీవల కాలంలో విజయ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ఇక్కడి సామాజిక పరిస్థితులపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తన పార్టీ భావజాలాన్ని, తమిళనాడు ప్రభుత్వ విజయాలను కేవలం సొంత రాష్ట్రానికి పరిమితం చేయకుండా.. తెలుగు ప్రజలకు కూడా చేరేలా ప్రత్యేకంగా తెలుగులో ప్రకటనలు ఇప్పిస్తున్నారు.

టీవీ ఛానళ్లలో సైతం ప్రచారం చేయిస్తున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయంగా కూడా తన ప్రభావాన్ని ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా పురుగున ఉన్న ఏపీకి విస్తరించాలని ఆలోచనలో విజయ్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

  • అద్భుత విజయంతో…

తమిళనాడులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్. కనీస అంచనాలు లేకుండా అధికార డిఎంకె, ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమిలను అధిగమించి మెజారిటీ సీట్లు సాధించారు. ఇతరుల సహకారంతో తమిళనాడులో అధికారం చేపట్టారు.. అయితే ఇదే స్ఫూర్తితో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలన్న ఆలోచనతో ఉన్నారు విజయ్.

అయితే తాజాగా దసరా ఉత్సవాలకు ఆహ్వానం అందడంతో ఇతర ముఖ్యమంత్రిలతో ఆయన వేదిక పంచుకోనున్నారు. విజయవాడ దసరా ఉత్సవాల వేదికగా ఆయన పర్యటిస్తే.. ఇక్కడి రాజకీయ, సామాజిక సమీకరణలపై ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది.

ఇక్కడి స్పందనను చూసి భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో టీవీకె ఏ రకమైన పాత్ర పోషించాలనే దానిపై ఆయన ఒక స్పష్టమైన నిర్ణయానికి రావచ్చు అని భావిస్తున్నారు. తమిళనాడు విజయ్ వేస్తున్న ప్రతి అడుగు జాతీయస్థాయిలోనూ ఆసక్తి రేపుతోంది.. ఇప్పుడు ఏపీ టూర్ ఖరారు అయితే తెలుగు రాజకీయాల్లో కూడా సరికొత్త చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు