కృష్ణా, క్రైమ్‌మిర్రర్: జిల్లాలోని నందిగామ మండలంల దండిఆనపూడి వద్ద అదుపు తప్పి కారుబోల్తాపడిన ఘటనలో ముగ్గరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరు చికిత్స పొందుతున్నాడు. మృతుడు తుమ్మలపల్లికి చెందిన కుచర్లపాటి సామియేలుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మద్యం మత్తులు అతివేగంగా కారు నడుపడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కాగా గాయపడిన సునీల్, సురేష్‌లను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కారు డోర్ తెరుచుకోవడంతో ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సామియేలు మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ఇవి కూడ చదవండి:
- వింత… ఒక్క పాముకు రెండు తలలు.. మీరూ చూడండి! వీడియో
-
దోశలో ఎలుక కేసులో ఊహించని ట్విస్ట్…!
-
ఆ 45 ఎకరాలు ఎక్కడ..?!
-
డ్రగ్ టెస్ట్‌లో ఐదుగురికి పాజిటివ్… విజయవాడలో కలకలం
