Homeక్రైమ్"బిగ్ బాస్" ఫేమ్ అర్చనా గౌతమ్ కేఫ్‌లో చోరీ.. క్యాష్ కౌంటర్‌నే ఎత్తుకెళ్లిన దొంగ

“బిగ్ బాస్” ఫేమ్ అర్చనా గౌతమ్ కేఫ్‌లో చోరీ.. క్యాష్ కౌంటర్‌నే ఎత్తుకెళ్లిన దొంగ

‘బిగ్ బాస్ 16’తో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి, మోడల్ అర్చనా గౌతమ్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ముంబైలో ఆమె నిర్వహిస్తున్న కేఫ్‌లో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున కేఫ్‌లోకి ప్రవేశించిన ఓ దొంగ.. ఏకంగా క్యాష్ కౌంటర్‌ను తీసుకెళ్లినట్లు అర్చనా వెల్లడించింది.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అర్చనా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కేఫ్‌ను ఎంతో శ్రమించి, తన పొదుపు డబ్బుతో ఏర్పాటు చేసుకున్నానని ఆమె తెలిపింది. కేఫ్‌లోని ప్రతి వస్తువును ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నానని, అలాంటి ప్రదేశంలో దొంగతనం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది.

చోరీపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించినట్లు అర్చనా వెల్లడించింది. ముంబై నగరం తనకు ఇప్పటివరకు సురక్షితమైన ప్రాంతంగానే అనిపించిందని, అలాంటి నగరంలో తన కేఫ్‌లోనే దొంగతనం జరగడం నమ్మలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలాంటి ఘటనలు మరెవరికీ ఎదురుకాకుండా వ్యాపారులు, ఇళ్ల యజమానులు ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలని అర్చనా సూచించింది. తమ చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది.

కాగా, అర్చనా గౌతమ్ 2025 అక్టోబర్‌లో ముంబైలో కేఫ్‌ను ప్రారంభించి ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. వంటపై తనకున్న ఆసక్తిని ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ ఇండియా’ కార్యక్రమంలోనూ ఆమె చూపించింది. ఇక ‘బిగ్ బాస్ 16’ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న అర్చనా.. ఆ తర్వాత ‘ఖత్రోన్ కే ఖిలాడీ 13’ వంటి రియాలిటీ షోలలోనూ పాల్గొంది.

also read: మంత్రి పర్యటనలో అనుకోని ప్రమాదం..  సర్వీస్ రైఫిల్‌ పేలడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు