Homeక్రైమ్ఉత్త‌రప్ర‌దేశ్‌లో తీవ్ర విషాదం...! విష‌వాయులు పీల్చి న‌లుగురు విద్యార్థులు మృతి...

ఉత్త‌రప్ర‌దేశ్‌లో తీవ్ర విషాదం…! విష‌వాయులు పీల్చి న‌లుగురు విద్యార్థులు మృతి…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: వాట‌ర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండ‌గా విష‌వాయువులు పీల్చి మృతి చెందిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బృందావ‌న్‌లో బుధ‌వారం చోటు చేసుకుంది. కాగా మ‌రో విద్యార్థి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా విషాద‌చాయ‌లు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశిష్‌ కుమార్‌ శర్మ బృందావన్‌లోని చైతన్య విహార్‌లో ఓ సంస్కృత పాఠశాల (గురుకులం) నిర్వ‌హిస్తున్నారు. ఈ గురుకులంలో సుమారుగా ఇక్కడ సుమారు 200 మంది విద్యార్థులు చదువుతుండగా.. దాదాపు 100 మంది క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉంటున్నారు.

మంగళవారం అర్ధరాత్రి సమయంలో గురుకులంలోని భూగర్భ వాటర్‌ ట్యాంక్‌ నుంచి దుర్వాసన రావడాన్ని విద్యార్థులు గుర్తించారు. దీంతో ట్యాంక్‌ను శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 12 నుంచి 14 అడుగుల లోతులో ఉన్న ట్యాంక్‌లోని నీటిని తొలుత మోటార్‌ సాయంతో బయటకు పంపించారు. అయితే కొంత నీరు మిగిలిపోవడంతో శుభ్రం చేసేందుకు ఓ విద్యార్థి ట్యాంక్‌లోకి దిగాడు. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే విషవాయువు ప్రభావంతో అతడు స్పృహ కోల్పోయినట్లు జిల్లా కలెక్టర్‌ చంద్ర ప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు.

అతడిని బయటకు తీసుకొచ్చేందుకు మరో నలుగురు విద్యార్థులు కూడా ఒక్కొక్కరుగా ట్యాంక్‌లోకి దిగారు. అయితే వారంతా విషవాయువును పీల్చడంతో స్పృహ కోల్పోయారు. మొత్తం ఐదుగురిని ట్యాంక్‌ నుంచి బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. రుద్ర అనే విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన నలుగురు విద్యార్థుల వయసు 17 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందని సమాచారం. మృతదేహాలను మార్చురీకి తరలించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తేజ సజ్జాకు కొత్త బాధ్యతలు.. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’తో హోస్ట్‌గా ఎంట్రీ!
  2. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి, కారోబార్‌
  3. రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
  4.  వివాహిత మృతిపై అనుమానాలు.. భర్త, అత్తామామలపై కేసు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు