Homeక్రైమ్68 రోజుల తరువాత ఎట్టకేలకు బెయిల్...!

68 రోజుల తరువాత ఎట్టకేలకు బెయిల్…!

  • ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్

  • సాటి శిక్షణ అధికారిణి పై లైంగిక వేధింపులు

  • మధ్యలో ఆత్మహత్య డ్రామా

  • సీరియస్ గా పరిగణించిన పోలీస్ శాఖ

  • ఎట్టకేలకు బెయిల్

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: పోలీస్ వర్గాల్లో సరికొత్త సంచలనం సృష్టించింది ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం. లైంగిక వేధింపుల కేసులు నిందితుడిగా మారారు కృష్ణారెడ్డి. గత కొంతకాలంగా ఆయన రిమాండ్ లో ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆయనకు బెయిల్ మంజూర అయింది.

హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ ఆయనపై లైంగిక ఆరోపణలు రావడం.. కేసు నమోదు కావడంతో.. సుమారు 68 రోజులపాటు చంచల్గూడా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం విశేషం.

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం…

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతూ వచ్చింది. ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి పట్టుదలతో ఐదో ప్రయత్నంతో ఆయన సివిల్స్ సాధించారు. ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు.

అయితే ఓ మహిళ ఐపీఎస్ ట్రైనింగ్ అధికారిణి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. శిక్షణ పొందుతున్న తోటి ప్రొబేషనరీ మహిళ ఐఏఎస్ అధికారిణి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు గాను ఉదయ్ కృష్ణారెడ్డి పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.

గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకొని వివాహం జరిగిన మహిళ విషయంలో మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధించాడని.. దాడి చేయడమే కాకుండా పాత వ్యక్తిగత వీడియోలను తన భర్తకు పంపి కాపురం కూల్చేలా బెదిరించాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పోలీసు వర్గాల్లోనే ఈ కేసు సంచలనంగా మారింది.

  • సీరియస్ గా పరిగణించిన పోలీస్ శాఖ..

శిక్షణ సమయంలో ఒక ఐపీఎస్ అధికారిపై ఈ స్థాయిలో ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. అందుకే పోలీస్ అకాడమీలో ఈ ఘటన జరగడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి శిక్షణను తక్షణమే సస్పెండ్ చేశారు. పోలీసులు అతడి పై అత్యాచారం, దాడి, ఐటీ చట్టం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

మరోవైపు కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య ఎపిసోడ్ కు తెర తీశారు. జూలై 28న ఆయన పోలీసులకు పట్టు పడ్డారు. అప్పటినుంచి ఆయన బెయిల్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది. అయితే కోర్టు కొన్ని షరతులు విధించింది. విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయవద్దని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు