Homeవైరల్గుజరాత్ ఎమ్మెల్యే ఇంటి శుభ్రతకు ఫైర్ ఇంజిన్.. వీడియో వైరల్‌ అవడంతో వివాదం

గుజరాత్ ఎమ్మెల్యే ఇంటి శుభ్రతకు ఫైర్ ఇంజిన్.. వీడియో వైరల్‌ అవడంతో వివాదం

గుజరాత్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఫైర్ ఇంజిన్ వినియోగించిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దాహోద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాచూభాయ్ ఖబాద్ ఇంటి శుభ్రత కోసం అగ్నిమాపక వాహనాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎమ్మెల్యే నివాసంలో ఫైర్ ఇంజిన్‌తో నీటిని ఉపయోగించి శుభ్రపరిచే దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు అందుబాటులో ఉండాల్సిన ఫైర్ ఇంజిన్‌ను వ్యక్తిగత అవసరానికి ఎలా వినియోగిస్తారంటూ స్థానికులు ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందించాయి. ప్రజా సేవల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం సరైన విధానం కాదని విమర్శించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను డిమాండ్ చేశాయి.

వివాదం ముదరడంతో అధికారులు ఈ వ్యవహారంపై స్పందించారు. ఎమ్మెల్యే కుమారుడి నుంచి ఫైర్ ఇంజిన్ వినియోగానికి సంబంధించి రూ.2,700 రుసుము వసూలు చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఘటనపై సమగ్ర విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ వనరుల వినియోగానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారా? ఫైర్ ఇంజిన్‌ను వ్యక్తిగత అవసరానికి ఎందుకు ఉపయోగించారు? అనే అంశాలపై విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రస్తుతం గుజరాత్ రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది.

also read: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 10 సీఎన్‌జీ ఏసీ బస్సులు దగ్ధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు