Homeక్రైమ్చేతబడి చేస్తుందన్న అనుమానంతో వృద్ధురాలిపై దాడి.. చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు

చేతబడి చేస్తుందన్న అనుమానంతో వృద్ధురాలిపై దాడి.. చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు

చేతబడి చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలిపై గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. మంచాల మండలం నోముల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన పల్లేటీ వెంకటమ్మ (60) చేతబడి చేస్తుందనే అనుమానంతో కొందరు గ్రామస్థులు ఆమె ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చినట్లు సమాచారం. అనంతరం ఆమెను ఓ చెట్టుకు కట్టేసి కొట్టినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో వెంకటమ్మ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా వెంకటమ్మ రాత్రివేళల్లో వింత పూజలు చేస్తోందని, చిన్న పిల్లలపై కూడా చేతబడి ప్రయోగాలు చేస్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఈ అనుమానాల నేపథ్యంలోనే ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

తనపై జరిగిన దాడిపై వెంకటమ్మ మంచాల పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఘటనకు సంబంధించి 14 మందిపై కేసు నమోదు చేశారు. దాడికి గల కారణాలు, ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చేతబడి వంటి మూఢనమ్మకాల ఆధారంగా వ్యక్తులపై దాడులకు పాల్పడటం చట్టపరంగా నేరం కావడంతో ఘటనపై పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు.

also read: ఉచిత టికెట్‌ అడిగిన విద్యార్థినిని జెండర్‌ అడిగిన కండక్టర్‌.. సస్పెండ్‌ చేసిన అధికారులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు