Homeక్రైమ్ఆన్‌లైన్ బెట్టింగ్‌లో న‌ష్ట‌పోయి యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌...? గ్రామంలో విషాదం...

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో న‌ష్ట‌పోయి యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌…? గ్రామంలో విషాదం…

సంగారెడ్డి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆన్‌లైన్ బెట్టింగ్‌ల‌కు అల‌వాటు ప‌డి ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న గుమ్మ‌డిద‌ల మండ‌లం బొంత‌ప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బొంత‌ప‌ల్లి గ్రామానికి చెందిన శ్రీ‌కాంత్‌(23) కొన్ని నెల‌లుగా బెట్టింగ్‌ల‌కు అటల‌వాటుప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు రూ.9 లక్షల వరకూ నష్టపోయినట్లు సమాచారం. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. మానసికంగా కూడా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి గమనించడంతో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు..

సమాచారం అందుకున్న గుమ్మడిదల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీకాంత్ బెట్టింగ్‌లకు అలవాటు పడటం.. అందులో భారీగా డబ్బు నష్టపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా యువకుడు ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు