Homeఆంధ్ర ప్రదేశ్ఆ రెండు జడ్పీ లపై వైసీపీ గురి...!

ఆ రెండు జడ్పీ లపై వైసీపీ గురి…!

  • బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ

  • అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్తులను కైవసం చేసుకునేందుకు వ్యూహం

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలను గెలుచుకోవాలని భావిస్తోంది. ఇక జిల్లా పరిషత్తులకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఆరు జిల్లాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇందులో మూడు జడ్పి స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఆలోచన చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో సునాయాసంగా విజయం సాధించవచ్చు అని భావించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ స్థానాలను తన ఖాతాల్లో వేసుకోవాలని చూసింది. కానీ అక్కడ కూటమి పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది.

  • చాలా ముందస్తుగా ప్రణాళిక..

విజయనగరం జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెలల ముందు నుంచి ప్రణాళిక ప్రారంభించింది. కానీ ఆ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న చిన్న శ్రీను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో భారీ షాక్ తగిలింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.

మొత్తం ద్వితీయ శ్రేణి నాయకత్వం అంత వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరింది. జడ్పీ చైర్ పర్సన్ గా తన కుమార్తె డాక్టర్ అనూషను రంగంలోకి దించాలని చూశారు బొత్స. చిన్న శ్రీను పార్టీకి రాజీనామా చేయడంతో బొత్స తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయనను మెజారిటీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అనుసరించడంతో అక్కడ వైసిపికి ఆశలు లేనట్టే.

  • ఆ రెండు జిల్లాలు అనుకూలం..

అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్వతీపురం మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి చెందినవారు ఉన్నారు. పాడేరు తో పాటు అరకకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి గిరిజన ప్రాంతమంతా అనుకూలంగా ఉంది. 2014 ఎన్నికల్లోను టిడిపి అక్కడ గెలవలేదు. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. 2024 లో కూటమి ప్రభంజనంలో సైతం ఆ రెండు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. అందుకే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో బలమైన అభ్యర్థిని బరిలో దించితే విజయం సునాయాసం అని వైసిపి భావిస్తుంది.

  • ఆ నేతలు క్రియాశీలకం..

మరోవైపు పార్వతీపురం మన్యంపై కూడా వైసిపి ఆశలు పెట్టుకుంది. అక్కడ పార్టీకి బలమైన నేతలుగా ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు ఉన్నారు. పీడిక రాజన్న దొర, పుష్ప శ్రీవాణి లు చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. దాదాపు 15 జడ్పిటిసిలు ఉన్న ఈ జిల్లా పరిషత్తు పరిధిలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే సునాయాస విజయం దక్కుతుందన్న అంచనాలు ఉన్నాయి.

మరోవైపు అరకు ఎంపీగా వైసీపీకి చెందిన తనుజారాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో వైసిపి బలంగా ఉంది. అందుకే ఆ రెండు జిల్లా పరిషత్ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని వైసిపి చూస్తోంది. చూడాలి ఆ ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు