-
వచ్చే వేసవిలో గా పూర్తి చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేశ్వరం ఎత్తిపోతలకు మరమ్మత్తులు చేసేందుకు సిద్ధపడుతోంది. ప్రాజెక్టు పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ, మరమ్మత్తుల పనులకు నవంబర్ రెండవ వారం నుంచి పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. 2027 వర్షాకాలానికి ప్రారంభం ముందే ఈ మూడు బ్యారేజీల పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీరియస్ గా ఆలోచన చేస్తోంది.
గతంలో అలా…
గతంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సైతం సి పేజీలు, ఇతర సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. దీంతో ప్రాజెక్టు భద్రతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిపుణుల కమిటీల సిఫార్సులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపేందుకు రంగం సిద్ధం చేసింది. తాత్కాలిక మరమత్తులతో సరిపెట్టకుండా, బ్యారేజీల పటిష్టతకు అవసరమైన పూర్తిస్థాయి పునరుద్ధరణ పనులను పగడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అత్యాధునికంగా పనులు…
ఈ సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా.. బ్యారేజీ పునాదులను మరింత పటిష్టం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అత్యాధునిక గ్రౌంటింగ్ పద్ధతులను వినియోగించునున్నారు. వరద ఉధృతికి నేల కోతకు గురికాకుండా నిరోధించేందుకు స్టిల్లింగ్ బేసిన్లను మరింత విస్తరించనున్నారు. నీటి ఊటలను అరికట్టేందుకు నూతన కటాఫ్ వాల్స్ నిర్మించనున్నారు. నిర్మాణ నాణ్యత, సాంకేతిక భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి దశలోనూ నిపుణుల పర్యవేక్షణ ఉండేలా ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కాలేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పూర్తయితే రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు సామర్థ్యం తిరిగి పుంజుకోనుంది. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగంలో మైలేజ్ రావడం ఖాయం.
అప్పట్లో అవినీతి ఆరోపణలు…
గత గులాబీ ప్రభుత్వ హయాంలో చాలా రకాల ఎదురు దెబ్బలు తగిలాయి. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపణ. గత ఎన్నికల్లో ఈ అంశం ప్రధానంగా ప్రభావం చూపింది. రైతాంగం కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. మూడో ఏడాది సమీపిస్తోంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి విమర్శలు రాకుండా జాగ్రత్తలు పడుతోంది. కాలేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఎత్తిపోతల మరమ్మతులకు సిద్ధపడుతోంది. వచ్చే ఏడాది వేసవిని గడువుగా పెట్టుకుంది. చూడాలి మరి ఎంతవరకు అధిగమించగలదో.
ఇవి కూడ చదవండి:
-
వలపు వల.. పడితే అంతే…!
-
ఈడి పై బీఆర్ఎస్ దండయాత్ర…!
-
బాలికపై యువకుడి లైంగిక దాడి.. బాధితురాలు గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి..
-
తెలంగాణాలో చంద్రబాబు…! పదేపదే ప్రస్తావిస్తున్న గులాబీ పార్టీ నేతలు…
