Homeక్రైమ్అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో హత్య చేసిన భార్య

అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో హత్య చేసిన భార్య

సికింద్రాబాద్ అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తపై గొడ్డలితో దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు.

మచ్చబొల్లారం గోపాల్‌నగర్‌లోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో శ్రీనివాస్‌, రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్‌ వ్యాపారంలో నష్టపోవడంతో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆవేశానికి గురైన రమాదేవి.. భర్త శ్రీనివాస్‌పై గొడ్డలితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.

ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే ఘటనకు కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

also read: టాయిలెట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు