Homeఆంధ్ర ప్రదేశ్శ్రీకాకుళం ఎంపీగా తమ్మినేని...?

శ్రీకాకుళం ఎంపీగా తమ్మినేని…?

  • ఆయన ముందు ఉన్న ఏకైక ఆప్షన్ అదే

  • ఎమ్మెల్యే టికెట్ లేదని తేల్చేసిన జగన్

  • తీవ్ర ఆలోచనలో సీనియర్ నేత

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానం. ఉమ్మడి రాష్ట్రంలోనైనా.. నవ్యాంధ్రప్రదేశ్లోనైనా ఆ జిల్లాకు ఎనలేని ప్రాధాన్యం. ఏ పార్టీ అధికారంలో ఉన్న.. ఆ జిల్లా నేతలకు సముచిత స్థానం దక్కడం ఖాయం. వైసిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా స్పీకర్ పదవి ఆ జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంకు కేటాయించారు. రాష్ట్ర మంత్రులుగా ధర్మాన బ్రదర్స్ తో పాటు డాక్టర్ అప్పలరాజుకు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు టిడిపి ప్రభుత్వ హయాంలో అబ్బాయి కింజరాపు రామ్మోహన్ నాయుడు కు కేంద్రమంత్రి పదవి.. బాబాయ్ అచ్చం నాయుడుకు రాష్ట్ర మంత్రి పదవి వరించింది. అయితే ఈ జిల్లా రాజకీయాల్లో ధర్మాన, కింజరాపు కుటుంబాలది ప్రత్యేక స్థానం.. అయితే ఒకప్పుడు విశేష ప్రభావం చూపించిన తమ్మినేని సీతారాం పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. ఆయన పదవీ విరమణ గౌరవప్రదంగా దక్కలేదు. కుమారుడుకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకున్న ఆయన కోరిక తీరలేదు.

సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా…

ఆమదాల వలస నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు తమ్మినేని సీతారాం. 1999 ఎన్నికల వరకు మకుటం లేని మహారాజుగా మారారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అయ్యారు. 2004లో తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి టిడిపిలో చేరి నట్టే చేరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి మూడుసార్లు పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేసరికి తమ్మినేని సీతారామును పక్కనపెట్టి ద్వితీయ శ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే జిల్లాలో తన ప్రాధాన్యత తగ్గిపోతుండడంతో తీవ్రంగా రగిలిపోయారు తమ్మినేని. వెంటనే అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తన ఆవేదనను తీసుకెళ్లారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానని కూడా అల్టిమేట్ ఇచ్చారు. కానీ జగన్ మాత్రం తమ్మినేనికి ఒక్క అవకాశం కల్పించారు. శ్రీకాకుళం పార్లమెంటు టికెట్ ఆఫర్ చేశారు.

రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్…

అయితే గత మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి గెలిచారు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఆయన విషయంలో తమ్మినేని సీతారాం ఆందోళనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనకు ఎంపీ సీటు సేఫ్ కాదని ఆయన భావిస్తున్నారు. అందుకే తిరిగి ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతలు తన కుమారుడికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోటీ చేస్తే ఎంపీ గానేనని.. ఎమ్మెల్యేగా చాన్స్ లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే తనకు ఇబ్బంది కరం అని తమ్మినేని భావిస్తున్నారు. మరి తమ్మినేని చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. వాట్సాప్‌లో డీల్స్.. ఇంట్లో దందా…! గుంటూరులో పోలీసుల దాడితో బయటపడిన గుట్టు..
  2. ఎంజీఆర్‌ జీవిత కథతో ‘పురట్చి తలైవర్‌’.. హీరోగా జేఎం. బషీర్‌
  3. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హీరో వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు
  4. రామాపురంలో ‘పల్లె పండుగ 3.0…! 29న చంద్రబాబు, పవన్ రాక…

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు