Homeక్రైమ్విశాఖ మేయర్ గా సీఎం రమేష్ సతీమణి...!

విశాఖ మేయర్ గా సీఎం రమేష్ సతీమణి…!

  • మూడు పార్టీలకు కావాల్సిన నేతగా గుర్తింపు

  • టీడీపీ హై కమాండ్ తో అనుబంధం

  • ఆపై ఆర్ధిక, అంగబలం

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : విశాఖ మేయర్ పదవికి విపరీతమైన పోటీ ఉంది కూటమిలో. ఇక్కడ మేయర్ పదవిని కూటమిలోని మూడు పార్టీలు బలంగా కోరుకుంటున్నాయి. అయితే రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడ మేయర్ పదవి టిడిపికి చిక్కలేదు. అందుకే ఇక్కడ తమకు ఈసారి విడిచి పెట్టాలని తెలుగుదేశం పార్టీ బలంగా కోరుతోంది. ప్రధానంగా గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గాలనుంచి కూడా బలమైన డిమాండ్ ఉంది. ఇంకోవైపు జీవీఎంసీ పరిధిలో జనసేన ఎమ్మెల్యేలు ఉండడంతో తమకు విడిచి పెట్టాలన్న వినతి వినిపిస్తోంది ఆ పార్టీ నుంచి. అయితే విశాఖలో తమకు కూడా బలం ఉన్నందున.. మేయర్ పదవి తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కమలం నాయకులు. ఇలా రకరకాల ప్రచారాల నడుమ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి మరింత జఠిలం అవుతోంది.

అనూహ్యంగా తెరపై…

అయితే ఇప్పుడు అనూహ్యంగా విశాఖ మేయర్ పదవి విషయంలో ఎంపీ సీఎం రమేష్ సతీమణి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం రమేష్ అనకాపల్లి బిజెపి ఎంపీ. రాయలసీమ జిల్లాలకు చెందిన ఆయన ఉత్తరాంధ్ర వచ్చి మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కమలం గుర్తు తెలియని చోట కూడా సత్తా చాటారు. అయితే విశాఖ మేయర్ పదవి విషయంలో మూడు పార్టీల మధ్య సంక్లిష్టత నెలకొన్న నేపథ్యంలో.. సీఎం రమేష్ సడన్ ఎంట్రీ ఇచ్చారు. తన భార్య శ్రీదేవిని పోటీలో పెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హై కమాండ్ కు దగ్గర వ్యక్తి.. ఆపై బీజేపీలో కూడా పరపతి ఉన్న నేత.. అన్నింటికీ మించి ఆర్థిక, అంగ బలం ఉన్న నాయకుడు కావడంతో సీఎం రమేష్ సతీమణి శ్రీదేవికి మేయర్ పదవి ఖరారు కావచ్చు.

టీడీపీ తో మంచి అనుబంధం…

తెలుగుదేశం పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధం సీఎం రమేష్ ది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదిర్చిన వారిలో సీఎం రమేష్ ముఖ్యులు. అటువంటి సీఎం రమేష్ తలచుకుంటే ఆయన సతీమణికి మేయర్ సీటు దక్కడం అంత కష్టమేమీ కాదు. మహిళా కోటాలో.. అందునా బిసి కోటాలో తప్పకుండా ఆయన చాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ఏపీలో 17 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో కొన్ని మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఆ రిజర్వేషన్లు కూడా చూసుకొని అన్నిచోట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విశాఖ మేయర్ పీఠాన్ని మహిళలకు రిజర్వ్ చేస్తే.. మరోచోట ఓపెన్ క్యాటగిరి అవుతుందని లెక్కలు ఉన్నాయి. అంతేకాదు గ్రేటర్ విశాఖ లాంటి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కు మహిళలకు కేటాయించామని గొప్పగా చెప్పుకోవచ్చు. సీఎం రమేష్ సతీమణికి టికెట్ ఇస్తే మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసే అవకాశం ఉంది. ఆశావహులు సైతం వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అనకాపల్లి ఎంపీగా గెలిచి నాన్ లోకల్ అనే ఫీలింగ్ ను తొలగించుకున్నారు సీఎం రమేష్. తప్పకుండా ఆయనకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ.

 

ఇవి కూడ చ‌ద‌వండి:

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు