Homeఆంధ్ర ప్రదేశ్వివేకానందరెడ్డి హత్య కేసులో మలుపు...!

వివేకానందరెడ్డి హత్య కేసులో మలుపు…!

  • అప్రూవర్ గా సునీల్ యాదవ్

  • ఈడికి కీలక వాంగ్మూలం

  • మిగతా నిందితులకు సైతం నోటీసులు

  • సుఫారి రూ.40 కోట్ల చుట్టూ దర్యాప్తు

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే సిబిఐ దర్యాప్తులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా ఈడి రంగంలో దిగింది. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్, హవాలా కోణాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ను హైదరాబాద్ లోని ఈడి ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన భారీ ఆర్థిక లావాదేవీల గురించి ఆయన ఈడి అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

చేతులెత్తేసిన సిబిఐ…

ఇప్పటికే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముగించింది. కానీ ఈడీ ఎంట్రీ తో సీన్ మారుతోంది. దాదాపు రూ.40 కోట్ల హవాలా లావాదేవీలు,.. ఫండింగ్ వ్యవహారంపై ఈడి ఫుల్ ఫోకస్ చేసింది. వివేకానంద రెడ్డి హత్య ఒప్పందంలో భాగంగా సునీల్ యాదవ్ కు అందినట్లు చెబుతున్న ఐదు కోట్ల రూపాయలు నగదు ఎక్కడి నుంచి వచ్చింది? దస్తగిరికి ఇచ్చిన కోటి రూపాయల నగదు అందులోనిదేనా? వేరొకరు సమకూర్చారా? అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిందితుల బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీల వివరాలతో పాటు డిజిటల్ ఆధారాలను అధికారులు పరిశీలించారు. గూగుల్ టేక్ అవుట్ డేటా, కాల్ డేటా రికార్డులను సునీల్ యాదవ్ ముందుంచి హత్య జరిగిన రోజు ఆయన కదలికలపై ఆరా తీశారు. సమగ్ర వివరాలను సేకరించారు. అయితే అప్పటి పరిస్థితిని వివరించిన సునీల్ యాదవ్ తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరినట్లు సమాచారం.

ఆ ఇద్దరికీ నోటీసులు…

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్నారు ఎర్ర గంగిరెడ్డి. ఏ3గా ఉమా శంకర్ రెడ్డిలను కూడా విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం విశేషం. సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారం, బ్యాంకు రికార్డుల ఆధారంగా వీరిని విచారించనుండడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈడి ఎంట్రీ తో మారిన సీన్…

వాస్తవానికి వివేకానంద రెడ్డి హత్య కేసు ముగిసిన అంశం అని అందరూ భావించారు. సిబిఐ కూడా చేతులెత్తేసినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి క్రమంలో ఈడి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారింది. సుఫారీ కోణంలో 40 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే మొత్తం ఈడి రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈడి ఎంట్రీ తో దీనికి సంబంధించిన మనీలాండరింగ్, ఆర్థిక మూలాలు బయటపడుతుండడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆధారాలతో సహా సాగుతున్న ఈ దర్యాప్తు రానున్న రోజుల్లో కీలక మలుపులు, సంచలనాలు సైతం నమోదు చేసే అవకాశం ఉంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. సంపూర్ణేశ్ బాబు క్లారిటీ.. నాగేంద్ర కుమార్‌తో వివాదంపై హీరో స్పందన
  2. మోదీతో మహిళ డీప్‌ఫేక్ ఫొటో.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
  3. వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. సునీల్ యాదవ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు
  4. ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు