Homeఆంధ్ర ప్రదేశ్వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. సునీల్ యాదవ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. సునీల్ యాదవ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు

క్రైమ్ మిర్రర్ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు విచారించారు. రెండు రోజుల పాటు సాగిన విచారణ తాజాగా ముగిసింది. ఈ విచారణలో వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన పలు కీలక అంశాలపై సునీల్‌ యాదవ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. హత్య జరిగిన సమయంలో తాను సంఘటనా స్థలంలోనే ఉన్నట్లు సునీల్‌ యాదవ్‌ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రెండో రోజు విచారణలో దాదాపు నాలుగు గంటలపాటు సునీల్‌ యాదవ్‌ను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఏ3 నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి మధ్య జరిగినట్లు చెబుతున్న ఫోన్‌ సంభాషణలపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే వివేకా హత్యకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, నగదు లావాదేవీలు, హత్య కోసం జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.40 కోట్ల ఆర్థిక వ్యవహారం, సంబంధిత వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్‌ కాల్స్‌ తదితర అంశాలపై ఈడీ అధికారులు సునీల్‌ యాదవ్‌ నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం.

రెండు రోజుల విచారణలో సునీల్‌ యాదవ్‌ వెల్లడించిన అంశాలు, ఆయన వాంగ్మూలంలో వచ్చిన వివరాలను అధికారులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించడంతో కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
also read ; ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు