Homeతెలంగాణ'సాహితీ ఇన్ ఫ్రా' కొత్తకోణం...! ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడి నోటీసులు...

‘సాహితీ ఇన్ ఫ్రా’ కొత్తకోణం…! ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడి నోటీసులు…

  • వ్యక్తిగత ఖాతా ద్వారా రూ. 2.1 కోట్ల మళ్లింపు

  • 27న విచారణకు హాజరు కావాలంటూ పేర్కొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

 

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ బ్యూరో : హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది సాహితి ఇన్ఫ్రాటెక్. ఈ వెంచర్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి ఈడి నోటీసులు ఇచ్చింది. దాదాపు 3 వేల కోట్ల స్కాం ఇది. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో అతి తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామంటూ వేలాదిమంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసింది సాహితీ యాజమాన్యం. ఈ మోసానికి సంబంధించి 64 కేసులు నమోదయ్యాయి. కంపెనీ యాజమాన్యంలోని సాహితీ లక్ష్మీనారాయణ వసూలు చేసిన డబ్బులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గాంధీకి ఈడి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ స్కాం తో వేలాదిమంది మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. బాధితులు గతంలో ధర్నాలు, నిరసనలు కూడా చేపట్టారు. పోలీసు విచారణ సైతం కొనసాగుతోంది. సమాంతరంగా ఈడి రంగంలోకి దిగింది.

రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన వైనం…

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసింది సాహితి ఇన్ఫ్రా ఫ్రీ లాంచ్ స్కాం. అయితే ఈ కేసులో ఈడి ఎంట్రీ ఇచ్చింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి నోటీసులు జారీ చేసింది. అనుమతులు లేకుండా ప్లాట్లు, విల్లాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు 842 కోట్ల మేర అమాయక కొనుగోలుదారులకు మోసం చేసిన ఈ స్కాం లో.. అరికెపూడి గాంధీ బ్యాంకు ఖాతాల ద్వారా దాదాపు రూ. 2.1 కోట్లు మళ్లించినట్లు ఈడి అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈనెల 27న తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ నిధులకు సంబంధించిన ఆస్తుల వివరాలేమిటి అనే కోణంలో సుదీర్ఘంగా ప్రశ్నించనున్నారు.

ఈడి ఎంట్రీ…

భారీగా నగదు చేతులు మారినట్లు తెలియడంతోనే ఈడి ఎంట్రీ ఇచ్చింది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ప్రారంభమైన ఈ దర్యాప్తులో ఈడి ఇప్పటి వరకు 56 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 160 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. బాధితుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయల నల్లధనాన్ని సంస్థ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, ఇతరులు పక్కదారి పట్టించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర పై ఆధారాలు లభిస్తుండడంతో విచారణ వేగవంతం అయ్యింది. ఇది పక్కా రాజకీయ – రియల్ ఎస్టేట్ దందా అని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. ఈడి దర్యాప్తులో బయటపడిన డిజిటల్ సాక్షాలు, వాట్సాప్ చాట్ లు, ఇప్పటికే అరెస్టయిన డైరెక్టర్లు ఇచ్చిన వాంగ్మూలాలు ఈ రాజకీయ రియల్ ఎస్టేట్ ముఠా బంధాన్ని బయటపెడుతున్నాయి. సాహితీ గ్రూప్ వసూలు చేసిన నగదులు దాదాపు 200 కోట్లకు పైగా నల్లధనాన్ని వేర్వేరు బినామీల పేరుతో.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోకి… భూముల కొనుగోలుకు మళ్ళించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈడి కోట్ల రూపాయల విలువచేసే విలువైన ఆస్తులను జప్తు చేసింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ఖమ్మంలో విషాదం.. గణేశ్ నిమజ్జన వేళ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్, రెండేళ్ల బాలుడు మృతి
  2.  కీరా దోసకాయతో కండోమ్ డెమో.. బీహార్ బయాలజీ టీచర్ వీడియో వైరల్
  3.  అర్జెంటీనా బంపర్ ఆఫర్.. భారతీయులకు వీసా నిబంధనల్లో భారీ ఊరట
  4.  దీన్‌దయాళ్ ఆలోచనలే అభివృద్ధికి మార్గదర్శకం.. ప్రధాని మోదీ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు