తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ పలుచోట్ల వర్షాలు దంచికొట్టనున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం అత్యధికంగా ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 10.30 గంటల వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఆస్కారం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం ప్రజలను హెచ్చరించింది. వీటితో పాటుగా కోస్తాంధ్రలోని మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాల తీవ్రత ఉండనుంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు (GNT), ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో రానున్న గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను పదవి నుంచి తొలగించడం ఎలా? రాజ్యాంగ నిబంధనలు ఇవే!
