ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిది నెలల పసికందు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రమేష్, మమత దంపతులకు 9 నెలల కుమారుడు అవేద్ ఉన్నాడు. గురువారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వర్షం కారణంగా ఎర్త్ పైపుపై ఉన్న స్టీల్ ప్లేట్‌కు విద్యుత్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఆడుకుంటూ అక్కడికి వెళ్లిన అవేద్.. స్టీల్ ప్లేట్‌ను పట్టుకోవడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే గుర్తించి చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ పసికందు మృతి చెందాడు.
చిన్నారి మృతితో రమేష్, మమత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తొమ్మిది నెలల పసికందు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read: UPIపై MDRకు వ్యతిరేకంగా ‘నో UPI డే’.. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిరసన
