Homeక్రైమ్షాకింగ్ ఘటన: బస్సు టైరు కిందపడి ఆరేళ్ల చిన్నారి మృతి!

షాకింగ్ ఘటన: బస్సు టైరు కిందపడి ఆరేళ్ల చిన్నారి మృతి!

క్రైమ్ మిర్రర్ : పాఠశాల ముగించుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటుందనుకున్న ఆ చిన్నారిని ప్రమాదం మృత్యురూపంలో కబళించింది. పాఠశాల బస్సు వెనుక టైరు కిందపడి యూకేజీ చదువుతున్న ఆరేళ్ల విద్యార్థిని దుర్మరణం చెందిన హృదయవిదారక సంఘటన జంగరాయి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
గ్రామస్థులు మరియు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని సరస్వతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బొమ్మరబోయిన కృష్ణ, లావణ్య దంపతుల మూడో కుమార్తె కీర్తన (6) యూకేజీ చదువుతోంది. గురువారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ప్రతిరోజూ లాగే స్కూల్ బస్సులోనే ఇంటికి చేరుకుంది.
ఇంటి వద్ద బస్సు దిగిన కీర్తన ముందుకు నడుస్తుండగా, బస్సు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి మరియు ముందుకు తిప్పే క్రమంలో బంపర్ తగిలి చిన్నారి కిందపడిపోయింది. వెంటనే బస్సు వెనుక టైరు ఆమెపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు కీర్తనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కళ్లముందే కుమార్తె అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
also read : హ్యాపీ హోమ్స్ కాలనీలో ఘోరం.. స్నేహితుడిని కత్తులతో పొడిచి దారుణ హత్య!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు