Homeరాజకీయంమాయావతి ఔట్...!

మాయావతి ఔట్…!

  • రాజకీయ వారసుడిగా అన్న కుమారుడు

  • బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా ఇషాన్ ఆనంద్

 

 

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు మాయావతి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు.. అయితే గత రెండు దశాబ్దాలుగా ఆమె పార్టీ బిఎస్పి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గట్టిగా పోరాటం చేయాలని చూస్తోంది. అందుకే పార్టీలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు మాయావతి. పార్టీ సంస్థాగత నిర్మాణంలో వీళ్ళకి మార్పులు చేపడుతున్నారు. అందులో భాగంగా ఇషాన్ ఆనంద్ ను పార్టీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు.. క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది. లక్నోలో నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా మాయావతి ఈ కీలక ప్రకటన చేశారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో…

వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన పంజాబ్ కు త్వరలో ఎన్నిక జరగనుంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి ప్రకటన చేశారు. ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇసాన్ ఆనంద్ స్వయాన మాయావతి తమ్ముడు, బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్ కుమార్ తనయుడు. ఆనంద్ కుమార్ కు ఇద్దరు కుమారులు. ఆకాష్, కిసాన్ లు కొంతకాలంగా మాయావతి తో కలిసి పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ వచ్చారు. పార్టీ అంతర్గత సమావేశాలు, చిలక విధాన నిర్ణయాలు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో ఇషాన్ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. భవిష్యత్తులో మాయావతి తర్వాత స్థానంలో నిలిచి పార్టీ వ్యవహారాలను పూర్తిగా నడిపించేందుకు ఆయనకు అవకాశం లభించింది.

ఆకాష్ ఆనందును తొలగించి…

వాస్తవానికి ఇషాన్ ఆనంద్ కంటే ముందు ఆయన సోదరుడు ఆకాష్ ఆనంద్ డిఎస్పి జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ నెల మూడున ఆయనను జాతీయ సమన్వయకర్త పదవి నుంచి మాయావతి తొలగించారు. ఆకాష్ ఆనంద్ రాజకీయంగా మరింత పరిణితి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఈ నెల 10న ఆయనను పార్టీ నుంచి సాగనంపారు. ఆకాష్ ఆనంద్ దూరం కావడానికి కుటుంబ వ్యవహారాలు కారణమని తెలుస్తోంది. మొత్తానికైతే మాయావతి తన రాజకీయ వారసుని ప్రకటించడం మాత్రం సంచలనంగా మారింది.

సుదీర్ఘ నేపథ్యం…

మాయావతి 1984లో కాన్సిరాం నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాది పార్టీలో చేరారు. 1985లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1987లో రెండోసారి పోటీ చేసి కూడా ఓటమి చవిచూశారు. 1989లో ఉత్తరప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మండలిలో అడుగుపెట్టారు. 1995లో కాన్సీరామ్ అనారోగ్యానికి గురవడంతో డీఎస్పీ అధ్యక్ష పదవి చేపట్టారు. 1998, 1999, 2004లో మూడుసార్లు లోక్సభకు, మరో మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1995లో నాలుగు నెలల పాటు, 1997లో 6 నెలల పాటు, 2002 నుంచి 2003 వరకు 17 నెలలు, 2007 నుంచి 2012 వరకు మొత్తం నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. అక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు.. వాయిదా వేసే ప్రసక్తే లేదన్న మంత్రి లోకేష్!
  2.  ‘సూపర్ ఎల్ నినో’ తీవ్రరూపం.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న క్లైమేట్ రిపోర్ట్!
  3. అర్జున అవార్డుపై ఆకాంక్ష వ్యక్తం చేసిన స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి!
  4. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. ‘SIR’పై విచారణకు సీఎం స్టాలిన్ సంచలన డిమాండ్!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు