క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి వారిని అప్రమత్తం చేశారు.
ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వర్షాల కారణంగా ఎదురయ్యే అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 1800 4250101 లను సంప్రదించాలని అధికారులు కోరారు. వీటితో పాటుగా జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను యంత్రాంగం విడుదల చేసింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ.. సీఈసీ అరెస్ట్, మళ్లీ ఎన్నికలకు మమతా బెనర్జీ డిమాండ్!
గోవా తీరంలో ఐపీఎల్ వేలం హంగామా: ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఆటగాళ్ల ఆక్షన్!
