దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ రంగానికి చెందిన కీలక వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సంచలన ఆరోపణలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ చట్టసభల ప్రతినిధుల ప్రవర్తనను వేలెత్తి చూపుతూ ‘X’ వేదికగా ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది.ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా 4,123 మంది ఎమ్మెల్యేలు, 426 మంది ఎమ్మెల్సీలు, 543 మంది లోక్‌సభ సభ్యులు మరియు 245 మంది రాజ్యసభ ఎంపీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, అంతటి పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ప్రజాప్రతినిధులలో ఏ ఒక్కరూ కూడా తమ ఆరోగ్య సమస్యల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం లేదని, సర్కారీ వైద్యం చేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని CJP విమర్శించింది.
అమెరికా దాడి ముప్పు.. సాయుధ దళాలను తీవ్ర అప్రమత్తం చేస్తూ ఇరాన్ ‘కోడ్ 100’ నిర్ణయం
అంతేకాకుండా, తమ స్వంత పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపకుండా కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదివిస్తున్నారని ఎద్దేవా చేసింది. సాధారణ ప్రజలకు ప్రాథమిక హక్కులుగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల పట్ల ప్రజాప్రతినిధులకు ఉన్న ఈ వైఖరి సామాన్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని పేర్కొంది. పాలకులు తాము ఇచ్చే హామీలకు, వారి ఆచరణకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని సూచించింది. ప్రజాప్రతినిధుల ఈ తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?
ఐపీఎల్ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ చుట్టూ ముసురుకున్న వివాదం: లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన యువతి
