Homeసినిమాచిరంజీవి ‘కాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్!

చిరంజీవి ‘కాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటివరకు సినిమా రిలీజ్‌పై కొనసాగిన అనిశ్చితికి తాజా ప్రకటనతో తెరపడింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల తేదీని వెల్లడిస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. అంతేకాదు, త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు కూడా తెలిపింది.

చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్ సంక్రాంతి బరిలోకి వస్తుండటంతో ‘కాకా’పై అంచనాలు పెరుగుతున్నాయి.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్‌తో పాటు త్వరలో ఫస్ట్ సింగిల్ కూడా రానుండటంతో ఇక సినిమా ప్రమోషన్స్ జోరందుకునే అవకాశం ఉంది.

2027 సంక్రాంతికి జనవరి 13న ‘కాకా’ థియేటర్లలోకి రానుండటంతో మెగాస్టార్ అభిమానులకు ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకంగా మారనుంది.

also read: న్యాయ వ్య‌వ‌స్త‌|పై న‌మ్మ‌కం ఉంది…! కేటీఆర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు