Homeతెలంగాణమంత్రివర్గంలోకి మధుయాష్కి గౌడ్...!

మంత్రివర్గంలోకి మధుయాష్కి గౌడ్…!

  • గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక

  • అటు తరువాత విస్తరణలో చోటు

  • సీఎం రేవంత్ సానుకూలం

  • హై కమాండ్ గ్రీన్ సిగ్నల్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారా? గవర్నర్ కోటా కింద ఆయనను ఎమ్మెల్సీగా పదవి ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నవంబర్లో గవర్నర్ కోటా కింద మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి.

దీంతో కాంగ్రెస్ హై కమాండ్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. సీఎం రేవంత్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అందులో భాగంగా మధుయాష్కీ గౌడ్ ఎంపిక ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట ఆయన ఏఐసీసీ స్థాయిలో కాంగ్రెస్ ప్రొఫెషనల్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేసి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

  • సీనియర్ మోస్ట్ లీడర్..

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు మధు యాష్కీ గౌడ్. విదేశాల్లో న్యాయవాద వృత్తిని చేపట్టిన మధు గౌడ్ 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో అడుగుపెట్టారు.

మంచి వాగ్దాటితోపాటు సామాజిక స్పృహ ఉన్న మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు దగ్గరయ్యారు. 2009లో సైతం రెండోసారి నిజామాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో మాత్రం టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో ఓడిపోయారు. 2019లో సైతం పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిపోయారు. 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.

  • అధిష్టానం వద్ద పట్టు..

ఏఐసీసీ స్థాయిలో మధుయాష్కి గౌడ్ కు మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ అగ్ర నేతలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఇటీవల జరిగిన ఓ సభలో మధుయాష్కీ గౌడ్ గురించి గొప్పగా చెప్పారు.. ప్రశంసలతో ముంచేత్తారు సీఎం రేవంత్.

బీసీల కోటా కింద ఎమ్మెల్సీగా ఆయనను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆరు సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ కోటాలో ఎంపిక చేసి.. ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు