Homeజాతీయంస్వతంత్ర్ భరద్వాజ్‌కు మధ్యంతర బెయిల్

స్వతంత్ర్ భరద్వాజ్‌కు మధ్యంతర బెయిల్

క్రైమ్ మిర్రర్ : సీజేపీ ఉద్యమకారుడు నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న రైట్ వింగ్ నేత స్వతంత్ర్ భరద్వాజ్‌కు కోర్టులో ఊరట లభించింది. ఆయనకు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

గత జూన్‌లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనపై స్వతంత్ర్ భరద్వాజ్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ ఘటనపై భరద్వాజ్ స్వయంగా మీడియాతో మాట్లాడిన వీడియోలు, వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో వివాదం మరింత ముదిరింది.

తాను ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచినప్పటికీ అరెస్టు కాలేదని ఓ మీడియా ఇంటర్వ్యూలో భరద్వాజ్ పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. తనకు రాజకీయ నేతలు కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ మద్దతు ఉందని కూడా ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఘటన అనంతరం ఢిల్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కొద్దిసేపటికే విడుదల చేశారు. కపిల్ మిశ్రా ఫోన్ చేయడంతోనే తనను పోలీసులు విడిచిపెట్టారని భరద్వాజ్ చెప్పడంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై సీజేపీతో పాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు. సంజయ్ కుమార్‌పై దాడికి పాల్పడిన భరద్వాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుడిపై దాడి జరిగినందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలని కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు.

దీంతో పోలీసులు స్వతంత్ర్ భరద్వాజ్‌పై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన భరద్వాజ్‌ను సెప్టెంబర్ 4న పోలీసులు అరెస్టు చేశారు.
also read : మాదాపూర్‌లో యువకుడి ఆత్మహత్య…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు