-
ఉత్సవ కమిటీకి భగవంతుడు మరింత శక్తినివ్వాలి : సబితా ఇంద్రారెడ్డి
-
శని, ఆదివారాల్లో భక్తుల రద్దీకనుగుణంగా అదనపు భద్రత ఏర్పాట్లు : ఏసిపి ప్రదీప్ కుమార్ రెడ్డి
-
దర్శనానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు : కళ్లెం నిరంజన్ రెడ్డి
బాలాపూర్, క్రైమ్‌మిర్రర్: దేశంలోని ప్రసిద్ధ గణేష్ ఉత్సవాలలో బాలాపూర్ గణనాథుడిది ప్రత్యేక స్థానం, అటువంటి గణనాథుని దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లతో పూరి జగన్నాథ ఆలయ నమూనాలో మండప నిర్మాణ ఏర్పాటు భక్తులను విపరీతంగా ఆకట్టుకున్నది. సోమవారం నాడు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి మంచి పాడి పంటలు పండాలని అలాగే ప్రతి ఏటా వినూత్న ఏర్పాట్లతో గణనాథుడి ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్న ఉత్సవ కమిటీకి ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన భగవంతుడికి, ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read:భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య.. పెళ్లైన మూడు నెలలకే విషాదం

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలలో దేశంలోనే ప్రత్యేకతను నిలుపుకున్న బాలాపూర్ గణనాథుడి ఉత్సవాలు ఏటేటా దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయ నమూనాలతో ఆలయ మండపం ఏర్పాటు చేస్తున్నామని, అందులోనే ఈ సంవత్సరం పూరి జగన్నాథ ఆలయ నమూనాలో మండప నిర్మాణం జరిగిందని, గత సంవత్సరం సుమారు 12 లక్షల మంది భక్తులు గణనాథుని దర్శించుకున్నారని, ఈ సంవత్సరం 20 లక్షల వరకు భక్తులు బాలాపూర్ గణనాథుని దర్శనానికి విచ్చేస్తారన్న అంచనాకు తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేయడమే కాకుండా వృద్ధులకు, చిన్న పిల్లలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని, నగరంలోని నలుమూలల నుండి వివిధ వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వాహన పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లో శంకర్‌పై మళ్లీ రౌడీషీట్.. బెదిరింపుల కేసులతో పోలీసుల చర్యలు

