క్రైమ్ మిర్రర్,సినిమా:- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘రణబాలి’. ఈ సినిమా విడుదల వాయిదా పడుతోందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం వెంటనే స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చింది. సినిమా పోస్ట్‌పోన్ అవుతుందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేసింది.ముందుగా ప్రకటించిన విధంగానే ‘రణబాలి’ చిత్రాన్ని అక్టోబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ హాఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) పనులు కూడా విజయవంతంగా పూర్తయ్యాయని మూవీ టీమ్ పేర్కొంది.
లైనప్‌పై అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ఇక బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు!
గతంలో విజయ్ దేవరకొండతో హిట్ కొట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో దీనిపై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా, ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అద్భుతమైన స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి, అనుకున్న సమయానికే అక్టోబర్ 16న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
రామాయణ నుంచి వినాయక చవితి స్పెషల్.. జై జై రామ్ తో భక్తి వైబ్స్…!
