Homeక్రైమ్తెలంగాణలో వాతావరణశాఖ హెచ్చరిక...! పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో వాతావరణశాఖ హెచ్చరిక…! పలు జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్,క్రైమ్ మిర్రర్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో వాతావరణం మారే అవకాశం ఉందని TGiCCC హెచ్చరించింది. రాష్ట్రంలోని హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read:హైదరాబాద్‌లో దారుణం ఘ‌ట‌న‌….ఆరు నెలల గర్భిణిని గొంతు నులిమి చంపిన భర్త..!

ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల సమీపంలో ఉండకుండా జాగ్రత్తపడటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రానున్న 24 గంటలు పలు జిల్లాల్లో వర్ష ప్రభావం కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని TGiCCC సూచించింది.

Also Read:ఇంట‌ర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం…! మ‌త్తుకు బానిస చేసి దారుణం…ఫోక్సో కేసు న‌మోదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు